సింగర్ ఇంట విషాదం..సోదరుడి అనుమానాస్పద మృతి

0

ఫేమస్ సింగర్ జేసుదాసు ఇంట విషాదం చోటుచేసుకుంది. జేసుదాసు సోదరుడు జస్టిన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందటం కలకలం సృష్టిస్తోంది. కేరళలోని కొచ్చిలోని బ్యాక్ వాటర్స్ వద్ద ఆయన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

జస్టిన్ బుధవారం ఉదయం చర్చికి వెళ్లి తిరిగి రాలేదు. రాత్రి వరకూ ఆయన రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. అయినప్పటికీ ఆయన ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో బ్యాక్ వాటర్స్ వద్ద ఆయన శవాన్ని గుర్తించిన పోలీసులు – శవాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఎర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తన కొడుకు మరణంతో జస్టిన్ కొంతకాలం నుంచి మనో వేదనకు గురవుతునట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని – అందుకే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతిచెందిన జస్టిన్ స్వయంగా సంగీతకారుడు – నటనా రచయిత కూడా అనేది కొందరికే తెలిసిన విషయం.
Please Read Disclaimer