ప్రియుడు లేక పెళ్లి లేక ఒంటరి హీరోయిన్ పాట్లు!

0

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.. బోత్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా..!! అన్న కవి హృదయం ఈ అందాల హీరోయిన్ కి వర్తిస్తుంది. బాలీవుడ్ లో ఎదురే లేని క్రేజీ హీరోయిన్ గా వెళుగుతున్న ఓ స్టార్ హీరోయిన్ పరిస్థితి తాను ఆశించినది ఒకటి అయితే రియాలిటీలో జరుగుతున్నది ఇంకొకటి. ప్రస్తుతం ఒంటరితనంతో పరిస్థితి మరీ బెంగపడిపోతోందట. జీవితంలో తాను ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతోంది. తనొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టు అయ్యింది పాపం. తనని ప్రేమించిన హీరోని కాదనుకుని.. వేరొక యంగ్ హీరోని ప్రేమించడం శాపమైంది. లేటు వయసులో తన కథ అడ్డం తిరగడంతో రెంటికి చెడ్డ రేవటిగా అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

యంగ్ హీరోతో కటీఫ్ చెప్పేశాక తిరిగి తనకు అవకాశం ఇచ్చి ప్రేమించి ఆదరించిన ఆ స్టార్ హీరో చెంతకే వచ్చేసింది. కానీ అతడిని ప్రేమిస్తున్నట్టు లేదా సహజీవనం చేస్తున్నట్టు కూడా ప్రచారం లేదు. తను ఇంకా ఒంటరిగానే ఉంటోందట. అతడితో కేవలం స్నేహం మాత్రమే కొనసాగుతోంది. దీంతో స్టార్ హీరోయిన్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవటిలా తయారైంది.

ఇటు ప్రియుడు లేక.. అటు పెళ్లాడాలనుకున్నా.. పెళ్లిలేక సదరు స్టార్ హీయిన్ సతమతమవుతోంది. పెళ్లి వయసు దాటుతున్నా ఒక తోడు లేకపోవడం.. వున్న తోడు పెళ్లాడే ఆలోచన లేని వాడు కావడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉందట. అతడిని వదిలి కొత్త ప్రియుడి కోసం వెళ్లడం వల్ల రెంటికి చెడ్డ రేవటి అయ్యిందని ముంబై మీడియాలో గుసగుసలు వేడెక్కిస్తున్నాయ్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గెస్ యువర్ సెల్ఫ్.. ఈజీగానే గెస్ చేయొచ్చు.
Please Read Disclaimer