సీతూ పాప నువ్వు సూపర్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియా సెన్షేషన్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో సితారకు సంబంధించిన వీడియో లేదా ఫొటో ఏదో ఒకటి ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సితార పాప వేసిన సరిలేరు నీకెవ్వరు డాంగ్ డాంగ్ పాట డాన్స్ తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో లో సితారను చూసిన వారు ఎవరైనా కూడా అబ్బ పాప ఏమైనా వేసిందా అనకుండా ఉండలేరు.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు.. తమన్నా కలిసి చేసిన ఆ పాటను సితార తాజాగా చేసింది. మొదటి నుండి కూడా సితారకు డాన్స్ అంటే చాలా ఆసక్తి. ఆ ఆసక్తితోనే నమ్రత ఆమెకు డాన్స్ లో శిక్షణ ఇప్పిస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో సితూపాప డాన్స్ వీడియోలను ఈమద్య చాలానే చూశాం కాని ఈ పాట సూపర్ అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ పొంగి పోతున్నారు.

సినిమాలో తమన్నా ఎలాంటి కాస్ట్యూమ్స్ ను ధరించిందో అలాంటి డ్రస్ లోనే సితార ఈ పాటకు డాన్స్ వేయడం మరింత హైలైట్ గా నిలిచింది. బ్యాక్ బెండ్ స్టెప్ తో పాటు ఫేస్ ఎక్స్ ప్రెషన్ ఇలా అన్ని కూడా ఒక ప్రొఫెషనల్ డాన్సర్ మాదిరిగా అనిపించిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సీతూ పాప డాన్స్ కు ఫిదా అయిన తమన్నా సో క్యూట్ అంటూ లవ్ ఈమోజీలు చాలా పోస్ట్ చేసింది. ఇంకా పలువురు సెలబ్రెటీలు కూడా సీతూ పాప డాన్స్ కు ఫిదా అయినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer