సితార- ఆద్య తొలి అతిథి రష్మిక

0

`మహర్షి` చిత్రంతో మహేష్-వంశీ పైడిపల్లి జిగిరీ దోస్తులు అయిపోయిన సంగతి తెలిసిందే. నన్ను నమ్మి నా కోసం ఎదురు చూసేవాళ్లే నా స్నేహితులు అని మహేష్ ఖరాకండిగా చెప్పేశారు. అందుకు తగ్గట్టే ఎంబీ కాంపౌండ్ లో వంశీకి ప్రత్యేకించి గౌరవం దక్కింది. కేవలం మహేష్ కోసమే రెండేళ్లు కెరీర్ వదులుకుని మరీ వెయిట్ చేశాడు వంశీ పైడిపల్లి. ఆ క్రమంలోనే ఆ ఇద్దరూ క్లోజ్ ప్రెండ్స్ అయిపోయారు. అందుకే సూపర్ స్టార్ క్రేజ్ -వంశీ ట్యాలెంట్ కలిస్తే మరిన్ని బ్లాక్ బస్టర్లు ఖాయమేనన్నది అభిమానుల నమ్మకం. ఈ కాంబినేషన్ లో మరో సినిమా పట్టాలెక్కబోతుంది. ఇక ఆ ఇద్దరి సినిమాలకు వారసులే ప్రచారకర్తలు. సూపర్ స్టార్ క్యూట్ డాటర్ సితార….స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్య సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసి కావాల్సినంత ప్రచారం చేస్తున్నారు.

ఇందులో ఆ ఇద్దరికీ సంబంధించిన ఫ్యామిలీ విషయాలతో పాటు ఫన్.. గేమ్స్.. వంటి ఆసక్తికర విషయాల్ని పోస్ట్ చేస్తూ యూట్యూబ్ చానెల్ ని రన్ చేస్తున్నారు. ఇకపై సెలబ్రిటీల ఇంటర్వూలకు ఆద్య-సితార యూట్యూబ్ ఛానల్ వేదికగా మారుతోంది. నేడు (శనివారం) సరిలేరు నీకెవ్వరు రిలీజ్ సందర్భంగా చిత్ర కథానాయిక రష్మిక మందనను తొలి గెస్ట్ గా ఆహ్వానించి డాటర్స్ ఇద్దరు చిట్ చాట్ చేసారు. సరిలేరు విశేషాలతో పాటు….2020 రష్మిక ప్లానింగ్స్ తదితర విషయాల్ని ముచ్చటించారు.

స్టార్ డాటర్స్ తో పాటు రష్మిక కూడా క్యూట్ కిడ్ గా మారి పోయింది. సరిలేరు చిత్రం లోని సూపర్ హిట్ సాంగ్ `హీ ఈజ్ సో క్యూట్ ..` కి ఆ ముగ్గురూ స్టెప్పులేశారు. అనంతరం సింగిల్ స్క్రీన్ థియేటర్ లో షో చూసేందుకు సితార తనతో పాటు రావాలని రష్మిక అడిగింది. దీంతో వెంటేనే సితార నో ఛాన్స్ అన్నట్లు ఓ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. చివరికి ఎలాగూ రష్మిక సితారను కన్విన్స్ చేసేసింది. మొత్తానికి స్టార్ కిడ్స్ యూట్యూబ్ చానెల్ రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది. స్టార్ డాటర్స్ ఛానెల్ కాబట్టి ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. సెలబ్రిటీల ఎక్స్ క్లూజివ్ ఇంటర్వూలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఫాలోవర్స్ వేగంగానే పెరగడం ఖాయం.
Please Read Disclaimer