సితార ఘట్టమనేని.. చిన్నారి ఎల్సా!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార పాప సోషల్ మీడియా లో చాలా ఫేమస్. సితార అల్లరి గురించి.. డ్యాన్సుల గురించి ఎదో ఒక సందర్భం లో నమ్రత షేర్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు మనం చెప్పుకో బోయేది మరో ఎత్తు. హాలీవుడ్ యానిమేటెడ్ ఫిలిం ‘ఫ్రోజెన్ 2’ తెలుగు వెర్షన్లో ఎల్సా పాత్రకు సితార తన గాత్రాన్ని అందిస్తోంది.

2013 లో రిలీజ్ అయిన ‘ఫ్రోజెన్’ ఇప్పటి వరకూ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన యానిమేటెడ్ చిత్రాల్లో టాప్ లో నిలిచింది. అంతే కాకుండా ఆ ఏడాది ‘ది బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం’ కేటగిరీ లో ఆస్కార్ అవార్డు సాధించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎల్సా పాత్ర కు సితార పాప వాయిస్ అందించడం పై స్పందించిన నమ్రత “సితార ఫ్రోజెన్ ను చిన్నప్పటి నుంచి చూస్తోంది. అందులో ఎల్సా పాత్ర అంటే తన కు చాలా ఇష్టం. సరిగ్గా అదే పాత్ర కు డబ్బింగ్ చెప్పాలని డిస్నీ వారు కోరడం తో మేము నో చెప్పేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు డిస్నీ వారికి కృతజ్ఞతలు. సితార ఈ విషయం లో చాలా హ్యాపీగా ఉంది.. ఎల్సా క్యారెక్టర్ తెలుగు వెర్షన్ డబ్బింగ్ చెప్పడం ఫుల్ గా ఎంజాయ్ చేసింది” అన్నారు.

నిజానికి ఎల్సా పాత్ర తెలుగు వెర్షన్ కు ఇద్దరు గాత్రం అందిస్తున్నారు. చిన్నప్పటి ఎల్సాకు సితార.. యువతి అయిన ఎల్సాకు నిత్యా మీనన్ గాత్రం అందిస్తుండడం విశేషం. ఒలాఫ్ పాత్ర కు కమెడియన్ ప్రియదర్శి గాత్రం అందిస్తున్నారు. ‘ఫ్రోజెన్ 2’ నవంబర్ 22 వ తారీఖున రిలీజ్ అవుతోంది.
Please Read Disclaimer