బిగ్ బాస్ కొత్త కెప్టెన్: ఓర్పు పట్టింది… కెప్టెన్ అయింది…

0

బిగ్ బాస్ కెప్టెన్ గా గత వారం నుంచి అలీ ఉంటున్న విషయం తెలిసిందే. గత వారం టాస్క్ లో అలీ గెలిచి కెప్టెన్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్ అయ్యే అవకాశం మహిళలకు ఇచ్చారు. కన్ఫెషన్ రూమ్ లో ఉన్న సీటులో ఎవరైతే ఇద్దరు సభ్యులు ముందుగా కూర్చుంటారో వారు కెప్టెన్ టాస్క్ లో పాల్గొంటారని చెప్పారు. దీంతో బజర్ మ్రోగగానే లేడీస్ అంతా కన్ఫెషన్ రూమ్ వైపు పరుగెత్తారు. చివరికి సీటులో వితిక- శివజ్యోతిలు కూర్చున్నారు.

దీంతో కెప్టెన్ టాస్క్లో వితికా- శివజ్యోతిలు పోటీ పడ్డారు. క్రైన్ సాయంతో ఇద్దర్నీ స్విమ్మింగ్ ఫూల్ పై నుండి గాల్లోకి లేపి.. వాళ్లు కిందికి రాకుండా వాళ్లు వాటర్ కి టచ్ కాకుండా చూడాలని ఎవరు ఎక్కువ సేపు గాల్లో ఉంటే వాళ్లే విజేతలు అంటూ గాలి టాస్క్ ఇచ్చారు. శివజ్యోతిని తాడుని అలీ- రవిలు పట్టుకుని ఉండగా వితిక తాడుని రాహుల్- వరుణ్ లు పట్టుకున్నారు. అలా వీరు చాలాసేపు శివజ్యోతి- వితికలని గాల్లో ఉండేలా చేశారు.

అయితే చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చిన వితికా.. చివర్లో కళ్లు తిరిగిపోవడంతో దించేయమని చెప్పింది. దీంతో వితికని దించేశారు. ఇక చివరి వరకు ఓర్పు పట్టి గాల్లో ఉన్న శివజ్యోతి కెప్టెన్ అయ్యింది. ఇక ఈ టాస్క్ ముగిశాక రాత్రి సమయంలో మహేశ్- బాబా మాస్టారులు హల్లో కింద పడుకుని ఉన్నారు. హౌస్ మేట్స్ అంతా అక్కడకి వెళ్ళి అల్లరి అల్లరి చేశారు. చుట్టూ తిరుగుతూ వాళ్ళని నిద్రపోకోకుండా చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో శ్రీముఖి- అషులు కలిపి రవి చెవిలో ఏదో పెట్టి ఆటపట్టించి అతని నిద్ర లేపేశారు. అలా సరదాగా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.
Please Read Disclaimer