సిద్ధార్థ్ – జీవీ ప్రకాష్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉందే

0

హీరో సిద్ధార్థ్.. మ్యూజిక్ డైరెక్టర్ కం హీరో జీవీ ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటించిన తమిళ చిత్రం ‘సివప్పు మంజల్ పచ్చై’. పిచ్చకారన్( తెలుగులో ‘బిచ్చగాడు’) ఫేమ్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ‘బిచ్చగాడు’ తర్వాత శశి దర్శకత్వం వహించిన చిత్రం ఇదే. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత శశి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. పైగా సిద్ధార్థ్ – జీవీ ప్రకాష్ కాంబో కూడా కొత్తగా ఉంది. నిన్నే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది.

స్ట్రిక్ట్ ట్రాఫిక్ పోలీస్ పాత్రలో సిద్ధార్థ్ నటించగా.. ఒక స్ట్రీట్ బైక్ రేసర్ పాత్రలో జీవీ ప్రకాష్ నటించాడు. సిద్ధార్థ్ క్యారెక్టర్ క్లాస్ గా ఉంటే జీవీ ప్రకాష్ అందుకు విరుద్ధంగా పూర్తిగా మాస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ట్రైలర్ స్టార్టింగ్ లోనే “రోడ్డే నాకు ఆఫీసు. మండే ఎండ నాకు ఏసి” అంటూ తన క్యారెక్టర్ గురించి సిద్ధార్థ్ రెండు ముక్కల్లో చెప్పేస్తాడు. “ట్రాఫిక్ రేస్ లో నడిపే బండి ముఖ్యం కాదు.. ఎవరు నడుపుతున్నారనేదే ముఖ్యం” అంటూ జీవీ ప్రకాష్ తన డ్రైవింగ్ టాలెంట్ గురించి ఇంట్రో ఇస్తాడు. హీరోలిద్దరి దారులు వ్యతిరేకమైనవి కావడంతో సంఘర్షణ ఏర్పడుతుంది. “మీరు రేసులు పెట్టుకొని.. చిన్న వయసు అనే పేరుతో తక్కువ ఫైన్ కట్టేసి తప్పించుకుంటానంటే నేను వదిలేస్తాను అనుకున్నారా?” అంటూ సీరియస్ గా రేసింగ్ బ్యాచ్ కు వార్నింగ్ ఇస్తాడు సిద్ధార్థ్. రేసులు మాత్రమే కాకుండా స్టొరీలో కూడా మరేదో సస్పెన్స్ ఉన్నట్టుంది. ఓవరాల్ గా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది.

కాశ్మీర పరదేశి.. లిజోమోల్ జోస్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సిద్దు కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్ పై రమేష్ పిళ్ళై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒకసారి టీజర్ పై లుక్కేయండి.. తమిళం రాకపోయినా ఇబ్బంది లేదు.. సబ్ టైటిల్స్ ఉన్నాయి కదా!
Please Read Disclaimer