సూరి జాబితాలో అరడజను మంది స్టార్ హీరోలు

0

ధృవ చిత్రం తర్వాత దాదాపుగా మూడు సంవత్సరాలకు సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డి తదుపరి చిత్రం విషయంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో కూడా సూరి తదుపరి చిత్రం ఏంటా అంటూ ఆసక్తి నెలకొంది. సైరా విడుదల కాకముందు నుండే ఈయన తర్వాత సినిమా అది ఇది అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రోజుకో హీరో పేరు వినిపిస్తున్నా కూడా ఇప్పటి వరకు సురేందర్ రెడ్డి మాత్రం స్పందించలేదు.

ఇప్పటికిప్పుడు సురేందర్ రెడ్డి సినిమా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం స్టార్ హీరోలు అంతా కూడా ఎవరి కమిట్ మెంట్స్ లో వారు ఉన్నారు. వారు కొందరు హీరోలు తర్వాత సినిమాలకు కూడా కమిట్ అయ్యి ఉన్నారు. కనుక సురేందర్ రెడ్డి ఒక వేళ స్టార్ హీరోలతోనే సినిమా చేయాలనుకుంటే వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు వెయిట్ చేయాల్సిందే అనిపిస్తుంది. స్టార్ హీరోలు కాకుండా చిన్న హీరోలతో అడ్జెస్ట్ అవుతాడా లేదంటే స్టార్ హీరోల కోసం వెయిట్ చేస్తాడా అనేది చూడాలి.

ప్రస్తుతం అయితే సురేందర్ రెడ్డి రామ్ చరణ్.. ప్రభాస్.. అల్లు అర్జున్.. వరుణ్ తేజ్ ఇలా ఆ హీరో ఈ హీరో అంటూ అరడజను పేర్లు వినిపిస్తున్నాయి. కాని ఇప్పటి వరకు ఏది ఫైనల్ అవ్వలేదని మాత్రం కన్ఫర్మ్ గా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సైరా కోసం దాదాపుగా రెండేళ్లు తీవ్రంగా కష్టపడ్డ సూరి కొంత కాలం విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చు అంటూ ఆయన సన్నిహితులు కొందరు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు.

విభిన్నమైన ఎంటర్ టైనర్స్ ను చేసే సురేందర్ రెడ్డి సినిమా కోసం ఆయన అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2020లో సూరి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం అనుమానమే అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
Please Read Disclaimer