గులాబీ బాల గుబాళింపు

0

బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ అనన్యా పాండే స్పీడ్ గురించి చెప్పాల్సిన పనేలేదు. `తేజాబ్` ఫేమ్ చుంకీ పాండే ముద్దుల కూతురే ఈ ఆటమ్ బాంబ్. కరణ్ జోహార్ నిర్మించిన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. టైగర్ ష్రాఫ్ హీరోగా పునీత్ మల్హొత్రా తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా ఆశించిన స్థాయిలో ఆకట్టుకో లేకపోయినా అనన్య పాండేకు మాత్రం అవకాశాల్ని తెచ్చిపెట్టింది. సెకండ్ సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

అనన్య పాండే నటించిన తాజా చిత్రం `పతి పత్ని ఔర్ ఓ` డిసెంబర్ లో రిలీజై భారీ వసూళ్లని రాబట్టింది. ఇప్పటికే వంద కోట్ల మార్కుని దాటింది. ఈ సినిమా తో కెరీర్ లో తొలి వంద కోట్ల సినిమాని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం `ఖాలీపీలీ` చిత్రంలో నటిస్తోంది. షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని `సుల్తాన్` ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్ నిర్మిస్తుండగా.. మక్భూల్ ఖాన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో వుండగానే అనన్య పాండే ఇంటర్ నెట్ ని హీటెక్కించేస్తోంది. స్కిన్ టైట్ ఫొటోలతో అందాల్ని బందించేస్తూ కుర్ర కారుకి కిర్రెక్కించేస్తోంది.

అనన్య పాండే గులాబీ వర్ణం షార్ట్స్ లో మెరిసిపోతూ తన అందాల్నిబందించేసింది. రోజ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న అనన్య పాండే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా ఫొటో షూట్ చేయించుకున్న అనన్య తన ఫొటోలతో మతిపోగొట్టేస్తోంది. ఆమె నటిస్తున్న థ్రిల్లర్ డ్రామా `ఖాలీపీలీ` ఈ ఏడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవలే అనన్య పాండే నటవారసత్వంపై రకకాల విమర్శల్ని తిప్పి కొడుతూ కోస్టార్ సిద్ధాంత్ అదిరిపోయే సపోర్ట్ ని ఇచ్చాడు. బాలీవుడ్ లో నటవారసులుగా ఆరంగేట్రం చేసినా రాణించడం అన్నది ఎంతో కష్టమని సిద్ధాంత్ క్లాస్ తీస్కున్నాడు. తండ్రులు నటులు అని ఈ పరిశ్రమలోకి వచ్చినా వారసుల సినిమాలు రిలీజయ్యాకే శుభాకాంక్షలు చెబుతారని.. అప్పటి వరకూ నమ్మనే నమ్మరని చెప్పి షాకిచ్చాడు. అనన్యపై నెప్టోయిజం కామెంట్లకు తాను వకాల్తా పుచ్చుకున్నాడు సదరు హీరో.
Please Read Disclaimer