బుల్లితెర స్టార్ భలే భలే బికిని

0

కరిష్మా తన్నా బుల్లితెర స్టార్. హిందీ సీరియల్స్.. రియాలిటీ షోస్ చూసేవారికి కరిష్మా పేరు తెలిసే ఉంటుంది. 2001 ‘క్యోంకి సాస్ భీ కభీ బహు థీ’ కెరీర్ మొదలు పెట్టిన కరిష్మా ఇప్పటివరకూ బిజీగానే ఉంది. సీరియల్స్ మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటుతోంది. ‘గ్రాండ్ మస్తి’.. ‘సంజు’ చిత్రాల్లో నటించింది. ఇవన్నీ ప్రొఫెషనల్ విషయాలు. వీటితో పాటుగా సోషల్ మీడియాలో జనాలను మాయలో పడేయడం అనేది కూడా కరిష్మాకు అలవాటే.

అందుకే కరిష్మా తన్నా ఇన్స్టా ఖాతాకు 3.9 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. వారికోసం తరచుగా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి కరిష్మా తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు “మిస్ అవుతున్నా. త్రో బ్యాక్ థర్స్ డే” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఒక బీచ్ రిసార్టులో స్విమ్మింగ్ పూల్ ఒడ్డున బికినీ ధరించి నిలుచుంది. ఎంతో నాజూకుగా ఉన్నా ఈ తన్నా ఒక చేతిని నడము పై పెట్టుకుని.. మరో చేతితో శిరోజాలు సవరించుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ ఒక హాట్ పోజిచ్చింది. మరో ఫోటోలో రెండు చేతులు చాపి టైటానిక్ హీరోయిన్లా నిలుచుంది. ఈ ఫోటోలో కరిష్మాను చూస్తే ఎవరూ 35+ అనుకోరు. అంత గ్లామరస్ గా కనిపిస్తూ ఈ తరం భామలకు ఫిట్నెస్ విషయం లో పోటీనిస్తోంది.

ఈ ఫోటోలకు కామెంట్లు అదిరిపోయాయి. “నువ్వు అప్పట్లో కూడా హాటే”.. “లొకేషన్ మాల్దీవ్స్ లాగా ఉందే”.. “తూ జీజ్ బడి హై మస్త్”.. అంటూ కామెంట్లు పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కరిష్మా చేతిలో ఏమీ ఆఫర్లు లేవు. టీవీ రియాలిటీ షో ‘ఖత్రోం కే ఖిలాడి 10’ లో పాల్గొంటోంది.
Please Read Disclaimer