స్కిన్ షోను పట్టించుకునే కాలం కాదు ఇది

0

ఒకప్పుడు ప్రేక్షకులు ఎక్స్ పోజింగ్ చేస్తే చూడాలని ప్రేక్షకులు కోరుకునే వారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. హీరోయిన్స్ ఒక మోస్తరు వరకు ఎక్స్ పోజింగ్ చేస్తే పర్వాలేదు. మరీ ఎక్కువ చేస్తే వల్గర్ గా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. హీరోయిన్స్ మరియు ఇతర నటీమనులు పాత్ర డిమాండ్ మేరకే స్కిన్ షో చేయాలి. మరీ అతి చేస్తే ఫలితం బెడిసి కొడుతుందని గత కొంత కాలంగా వస్తున్న సినిమాలను చూస్తుంటే అర్థం అవుతుంది.

హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ విషయమై అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. గతంతో పోల్చితే ఇప్పుడు హీరోయిన్స్ గ్లామర్ షో గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. సినిమాలోని హీరోయిన్ లుక్ మరియు ఆమె నటనపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అంది. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు ఆధరణ పెరగడం మంచి పరిణామం అని హీరోయిన్స్ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయాలనుకుంటారని ఆమె చెప్పుకొచ్చింది.

హీరోయిన్స్ ను కేవలం గ్లామర్ కోసమే ఎన్నో సినిమాల్లో తీసుకున్న సందర్బాలు ఉన్నాయి. కథలో ప్రాముఖ్యత ఉన్న హీరోయిన్స్ చాలా తక్కువగా అని చెప్పుకోవచ్చు. హీరోయిన్స్ ను గ్లామర్ డాల్ గా చూపించిన సినిమాలపై విమర్శలు వ్యక్తం అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే లావణ్య త్రిపాఠి స్కిన్ షో చేయడం కంటే నటనకు ఆస్కారం ఉన్న పాత్రను చేయాలని కోరుకుంటుంది. ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ చిత్రంలో హాకీ ప్లేయర్ గా లావణ్య త్రిపాఠి కనిపించబోతుంది. మొదటి సారి లావణ్య త్రిపాఠికి లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ దక్కింది. మరి దీన్ని ఏమేరకు సక్సెస్ చేసుకుంటుందో చూడాలి.
Please Read Disclaimer