బిగ్ బాస్ లో పెళ్లి చూపులు అదిరాయ్…

0

శనివారం ఎపిసోడ్ కి పూర్తి విరుద్ధంగా ఆదివారం ఎపిసోడ్ సాగింది. శనివారం ఎపిసోడ్ లో వచ్చీ రాగానే ఇంటి సభ్యులకు గట్టి క్లాస్ పీకిన నాగార్జున…ఆదివారం సరదా టాస్క్ లు ఇచ్చి వారిలో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఫన్నీగా ఉండే నాలుగు స్కిట్లు ఇచ్చి వారితో చేయించారు. ఆయనే ఒక టాపిక్ ఇచ్చి ఇంటి సభ్యుల్లో కొంతమందిని సెలక్ట్ చేసుకుని స్కిట్ ఇచ్చారు.

అందులో మొదటిగా పెళ్లి చూపులు స్కిట్ శ్రీముఖి – శిల్ప – మహేశ్ – వరుణ్ లకు ఇచ్చారు. ఈ స్కిట్ లో మంచి ఫన్ వచ్చింది. ఆ తర్వాత పునర్నవికి లైన్ వేసే స్కిట్ రాహుల్ కి ఇచ్చారు. ఇక పునర్నవి బాయ్ ఫ్రెండ్ పాత్ర బాబా భాస్కర్ వచ్చి రాహుల్ కి వార్నింగ్ ఇవ్వాలి. వీరు బాగానే చేశారు.

అలాగే హిమజ – రవి – మహేశ్ కు ఓ స్కిట్…శ్రీముఖి – వితికా – బాబా భాస్కర్ లకు ఓ స్కిట్ ఇచ్చారు. అయితే స్కిట్లలో మొదటి చేసిందే బాగుందని నాగార్జున చెప్పారు. ఈ సరదా స్కిట్ల తర్వాత ఒక్కో హౌస్ మేట్ కు జింగిల్ చేయాలని రాహుల్ – బాబా భాస్కర్ లకు నాగ్ ఆర్డర్ వేశారు. దీంతో వారు ఇద్దరు ఇంటి సభ్యుని క్యారెక్టర్ కు అనుగుణంగా పాట పాడి…డ్యాన్స్ చేయించారు.

రాహుల్ షూట్ కేస్ మీద వాయించిన తీరు – పాడిన విధానం అద్భుతం. లిరిక్స్ కూడా చాలా బాగా రాశారు. బాబా కూడా డ్యాన్స్ మంచిగా కంపోజ్ చేశారు. ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న హిమజ శనివారం సేఫ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆదివారం ఎపిసోడ్ లో శ్రీముఖి – మహేశ్ – పునర్నవిలు సేఫ్ అయినట్లు చెప్పిన నాగార్జున వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన శిల్పని ఎలిమినేట్ చేశారు.
Please Read Disclaimer