చిన్న సినిమాలకు మాత్రమే ‘ఓవర్ ది టాప్’…!

0

సినీ ఇండస్ట్రీ గత రెండు నెలలుగా మూతబడిపోయి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడప్పుడే థియేటర్స్ మల్టిప్లెక్సెస్ తెరుచుకునే అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ థియేటర్స్ ఇప్పుడు ఓపెన్ అయినా ఒకప్పటిలా ప్రేక్షకులు వస్తారో రారో అనే డౌట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న చిత్రాలను ఇప్పుడు థియేటర్లలోకి విడుదల చేసినా వాటి నిర్మాణానికి వెచ్చించిన డబ్బులు రాకపోవచ్చునని చాలా మంది నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే తమ చిత్రాలను డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేసుకుంటే మేలనే భావనలో ఉన్నారు. దీంతో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న చాలా సినిమాలు అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ సన్ నెక్స్ట్ ఆహా వంటి ఓటీటీ మాధ్యమాలను ఎంచుకొంటున్నాయి. ఈ క్రమంలో 8 సినిమాలు ఓటీటీ రిలీజ్ కి సిద్దపడ్డాయి. ఇప్పటికే తెలుగులో ‘అమృతరామమ్’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల అయింది. తమిళంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్మగల్ వందాల్’ సినిమా కూడా ఓటీటీలో దర్శనమిచ్చింది.

అయితే ఈ రెండు చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. ఈ సినిమాల్లో కంటెంట్ లేకపోవడంతో చూసినవాళ్లు.. విమర్శకులు బ్యాడ్ రివ్యూస్ ఇచ్చేసారు. దీంతో ఈ చిత్రానలకి అంతగా ఆదరణ దక్కలేదు. ఈ నేపథ్యంలో ఓటీటీలలో రిలీజ్ కాబోతున్న సినిమాల రిజల్ట్స్ ఎలా ఉంటాయో అని అనుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు చిన్న సినిమాలు కాబట్టి ఓటీటీ ఆఫర్ చేసిన అమౌంట్ ప్రొడ్యూసర్స్ కి ఓకే అనిపించి ఉండొచ్చు. కానీ ఓటీటీని నమ్ముకొని పెద్ద సినిమాలను రిలీజ్ చేస్తే పరిస్థితి ఏంటని సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు. సినిమా కంటెంట్ బాగుంటే అంతో ఇంతో ఆదరణ ఉంటుంది.. అదే నెగటివ్ రివ్యూస్ వస్తే మాత్రం ప్రొడ్యూసర్ నష్టాలు చవి చూడాల్సిందే. అదే థియేటర్స్ లో అయితే ప్లాప్ సినిమాకి కూడా ఫస్ట్ టూ డేస్ కలెక్షన్స్ ప్రొడ్యూసర్స్ ని బయటపడేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఓటీటీలో అలా కాదు. సినిమా ఓటీటీలో వచ్చిన వెంటనే పైరసీ సైట్స్ లో ఒరిజినల్ క్వాలిటీతో మూవీ వచ్చేస్తోంది. అలాంటప్పుడు సగటు ప్రేక్షకుడు డబ్బులు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడటం కంటే పైరసీ సైట్స్ లో హెచ్ డి ప్రింట్ డౌన్లోడ్ చేసుకోవాలని భావిస్తాడు. దీంతో చిన్న సినిమాలకు పెద్దగా ప్రభావం లేకపోయినా పెద్ద సినిమాలు నష్టపోయే అవకాశం ఉంది.

అయితే ఇప్పుడు ఓటీటీలలో రిలీజ్ కాబోతున్న మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన ‘పెంగ్విన్’.. అమితాబ్ బచ్చన్ – ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన చిత్రం ‘గులాబో సితాబో’.. విద్యా బాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శకుంతల దేవి’.. అలాగే కన్నడ ‘లా’ మరియు ‘ఫ్రెంచ్ బిర్యానీ’.. మలయాళ ‘సూపియుమ్ సుజాతయుమ్’ వంటి సినిమాలు ఎలా ఉండబోతాయో అనే ఆసక్తి పెరిగింది. ఒకవేళ ఈ సినిమాల పరిస్థితి కూడా ఇలానే ఉంటే తమ సినిమాలను కొన్ని రోజులు వెయిట్ చేసైనా థియేటర్స్ లో విడుదల చేసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇంకొంత మంది మాత్రం కోట్లు పెట్టి తీసిన సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తున్నారట. మొత్తం మీద స్మాల్ బడ్జెట్ సినిమాలకి ఓటీటీ ఓకే కానీ భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రం నాట్ ఓకే అంటున్నారు సినీ విశ్లేషకులు.
Please Read Disclaimer