అగ్ర నిర్మాతపై చిన్న నిర్మాతల కౌంటర్

0

చిన్న సినిమాలకు ఆదరణ తగ్గిందని కంటెంట్ లేని వాటిని అమెజాన్ – నెట్ ఫ్లిక్స్ లో చూసేందుకు జనం అలవాటు పడుతున్నారని వేడెక్కించే కామెంట్ చేశారు టాలీవుడ్ అగ్ర నిర్మాత కం ఎగ్జిబిటర్ డి.సురేష్ బాబు. ఆయన చెప్పింది నిజమా? అంటే.. అవుననే అంగీకరిస్తున్నారు పలువురు చిన్న నిర్మాతలు.

సురేష్ బాబు గారు చెప్పింది నిజం… “కంటెంట్ లేని చిన్న -పెద్ద ఏ సినిమాకి కూడా జనం థియేటర్ కి రావటం లేదు!“ అంటూ చిన్న నిర్మాతలు సవరణ చేస్తూ కొటేషన్ ఇచ్చారు.

అయితే జనాలు థియేటర్లకు రాకపోవడానికి కారణమేమిటి? అంటే.. మెజారిటీ జనాలకు టైం లేక రావడం లేదట. రూ.100- 150 పెట్టి 2 గం.టైం వేస్ట్ చేయలేక.. జనాలు థియేటర్లకు రావడం లేదట. అయితే ఇవేవీ పట్టించుకోని కొత్త నిర్మాత.. దర్శకుడు తాను గొప్పగా తీసాను అనుకున్న సినిమాని జనం చూడలి అనుకుంటాడు. దీనివల్ల అమెజాన్- నెట్ ఫ్లిక్ వల్ల ఆ కోరిక తీరుతోంది. థియేటర్లకు రప్పించినా రప్పించలేకపోయినా.. చిన్న సినిమాలు ఈ రకంగా అయినా జనానికి చేరువ అవుతున్నాయని ఒక చిన్న నిర్మాత విశ్లేషించారు. డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థల వల్ల నిర్మాత కి ఎంతో కొంత ఆదాయం వస్తోందని..

కాబట్టి పెద్దా చిన్నా అన్న తేడాలేకుండా అందరికీ అమెజాన్- నెట్ ఫ్లిక్స్ వంటివి వరం అని కూడా తెలిపారు.

మొత్తానికి ఎంతో అనుభవజ్ఞుడైన డి. సురేష్ బాబుపై కౌంటర్ వేయకుండానే అన్నిటినీ అంగీకరిస్తూనే చిన్న సినిమా చెత్త సినిమా కాదు! అని చెబుతుండడం ఆసక్తికరం. ఇక ఇప్పటికే ఛాంబర్ వర్గాల్లో పలువురు అగ్ర నిర్మాతల ఎల్.ఎల్.పి కార్యకలాపాలపై కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి. సపరేట్ ఎల్.ఎల్.పి (గిల్డ్ నిర్మాతలు) సొంత కుంపటిపై గుర్రుమనేవారు ఉన్నారు. వీళ్లందరిలోనూ డిజిటల్ వ్యవహారంపై చర్చ సాగుతోందట. ఇక డిజిటల్ పై కొత్త ప్రతిపాదనపైనా ప్రస్తుతం చాంబర్ వర్గాల్లో సీరియస్ గా చర్చ సాగుతోందని తెలిసింది.
Please Read Disclaimer