‘ఎక్స్ ఫైర్’అయ్యేది లేదు..వెబ్ సీరిస్ తో నేనేంటో చూపుతా..!

0

బాలీవుడ్ కండల వీరుడు ఐశ్వర్యరాయ్ ని ఎంతగా లవ్ చేసాడో అందరికీ తెలిసిందే..అయితే కొన్ని కారణాల కారణంగా వాళ్లిద్దరూ విడిపోయారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఆమెని మర్చిపోలేక పోయాడు. ఆమె పోలికలతో ఉన్న పలువురిని హీరోయిన్లుగా చేసి సినిమాలు చేశాడు. అందులో ఒకరు స్నేహ ఉల్లాల్. ఆమె అచ్చు గుద్దినట్లు ఐశ్వర్యారాయ్ లాగే ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమె అందరి మదిని దోచి మినీ ఐశ్వర్యరాయ్ గా గుర్తింపు పొందింది. హిందీ సినిమాలతో పాటు తెలుగు తమిళ కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా కరెంట్ సినిమాలతో కుర్రకారును గిలిగింతలు పెట్టింది.

ఆ తర్వాత వరుసగా ప్లాప్ లు రావడంతో క్రమేణా ఆఫర్లు తగ్గిపోయాయి.కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆమె త్వరలో ‘ఎక్స్పైరీ డేట్’ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను పలుకరించబోతోంది. ఈ సీరిస్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఈ వెబ్ సీరిస్ రెడీ అయ్యి జూన్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నా.. కరోనా బ్రేక్ వేసింది. అక్టోబరు చివర్లో ఓటీటీ లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ ని పవన్ కళ్యాణ్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మించాడు. శంకర్ మార్తాండ్ డైరెక్ట్ చేశాడు. తన భార్యను చంపేసిన ఓ వ్యక్తి జీవితంలో తర్వాత జరగబోయే సంఘటనలతో ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. స్నేహ ఉల్లాల్ రీ ఎంట్రీలో ఎంతలా మెప్పిస్తుందో చూడాలి.