మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ లో తెలుగమ్మాయ్

0

స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియన్ సెల్వన్` ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. విక్రమ్- కార్తీ- జయం రవి- ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రల్లో ఈ మల్టీస్టారర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీ బడ్జెట్ తో మద్రాస్ టాకీస్-లైకా ప్రొడక్షన్స్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నాయి. ఇటీవలే చెన్నైలో తొలి షెడ్యూల్ పూర్తిచేసారు. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో తెరకెక్కుతుంది.

తాజాగా ఈ సినిమాలో తెలుగమ్మాయి శోభిత ధూళిపాల అరుదైన అవకాశాన్ని చేజిక్కిచుకుంది. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన శోభిత ధూళిపాళ గూడాఛారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇందులో రా ఏజెంట్ గా నటించి ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత అమ్మడి కెరీర్ ఆశించినంతగా ముందుకు సాగలేదు. సక్సెస్ ఖాతాలో ఉన్నా.. ఇక్కడ దర్శకనిర్మాతలు ఎవరూ సరైన అవకాశం ఇవ్వలేదు. బాలీవుడ్ లో మాత్రం బిజీ స్టార్ గానే కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ కురుప- లక్ష్మీబాంబ్ లాంటి చిత్రాల్లో అవకాశాలు అందుకుంది.

మరోవైపు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలోనే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఘోస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో నటించింది. నటిగా తనని తాను నిరూపించుకుని ఇదే స్పీడ్ లో మణిర్నతం సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ అరుదైన అవకాశంతో శోభిత మరోసారి టాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. శోభిత మంచి కూచిపూడి డాన్సర్. ఆ ప్రతిభ చూసి మణిసార్ ఛాన్సిచ్చారట. ఈ చిత్రంలో భరతనాట్యం లో ప్రావీణ్యం ఉన్న యువరాణి పాత్రలో కనిపించనుందట. భారీ మల్టీస్టారర్ లో ఆ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. అదే నిజమై.. సినిమా విజయం సాధిస్తే తెలుగమ్మాయికి అవకాశాలు పెరుగుతాయనే భావిద్దాం. పొన్నియన్ సెల్వన్ కి కల్కి కృష్ణమూర్తి రచించిన ఓ నవల స్ఫూర్తి అన్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-