తెనాలమ్మాయా మజాకా?

0

`గూఢచారి` చిత్రంతో తానేంటో నిరూపించింది తెనాలమ్మాయ్ శోభిత ధూళిపాళ. అందాల పోటీల్లో సత్తా చాటి.. అటుపై మోడలింగ్ రంగంలో ప్రవేశించి అక్కడా సత్తా చాటిన ఈ బ్యూటీ అటుపై బాలీవుడ్ లో ప్రవేశించింది. 2018లో గూఢచారి చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టి ప్రస్తుతం కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. అమెజాన్ – నెట్ ఫ్లిక్స్ వేదికలుగా వెబ్ సిరీస్ లలో నటిస్తూ వేడెక్కించబోతోంది.

ప్రతిభ మేధోతనం ఉన్న మోడల్ కం నటిగా శోభితకు అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ భామ సోషల్ మీడియాలతోనూ అభిమానులకు టచ్ లో ఉంది. నిరంతరం అక్కడ లేటెస్ట్ ఫోటోషూట్లతో అందుబాటులో ఉంది. తాజాగా ఫెమీనా వెడ్డింగ్ టైమ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చింది. శోభిత నెవ్వర్ బిఫోర్ లుక్ ఇది.

బంగారు వర్ణం డిజైనర్ డ్రెస్ లో ప్రత్యేకించి వింగ్ స్టైల్ తో ఎంతో స్పెషల్ గా ఎలివేట్ అయ్యింది. నీజిప్షియన్ స్టైల్ డిజైనర్ ఎలివేషన్ తో పాటు.. పండోరాపై మొప్పల మొక్కను పోలిన బ్యాక్ గ్రౌండ్ డిజైనర్ లుక్ సంథింగ్ స్పెషల్ గా హైలైట్ అయ్యింది. శోభిత ఇంటర్నేషనల్ అప్పియరెన్స్ మైమరిపిస్తోంది. విదేశాల్లో ఎకనమిక్స్ విద్యను అభ్యసించిన శోభిత అటుపై మోడలింగ్ .. నటనలో ప్రవేశించి.. అంచెలంచెలుగా నటన పరంగా అడుగులు వేస్తోంది.
Please Read Disclaimer