ఆ రియల్ హీరోకు ‘ఆచార్య ‘ సెట్స్ ‘లో ఘన సన్మానం

0

కరోనా లాక్డౌన్లో రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్.. మరోసారి దక్షిణాదిపై తన ప్రేమను వ్యక్తం చేశారు. సౌత్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఇక్కడ షూటింగ్ లో ఉంటే సొంత ఇంట్లోనే ఉన్న ఫీలింగ్ కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. తనకు సౌత్ అంటే ఎంతో ఎనలేని ఇష్టమని కూడా చెప్పారు. లాక్డౌన్ టైంలో ఇక్కట్లు పడ్డ వలసబాధితులను ఉపాధి కోల్పోయిన వాళ్లను రైతులను విద్యార్థులను సోనూసూద్ ఎంతో ఆదుకున్నారు. ఎవరు ఏం అడిగినా తన వంతు సాయం చేశారు. ఏపీకి చెందిన ఓ వ్యక్తి వ్యవసాయం చేసేందుకు ఇబ్బందులు పడుతుండటంతో అతడికి ట్రాక్టర్ కొనిచ్చాడు. ఎందరో వలసకార్మికులను సొంతడబ్బు పెట్టి స్వగ్రామాలకు పంపించాడు. ఎందరో చిన్నారులకు ఆన్లైన్ చదువుల కోసం ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు కొనిచ్చాడు. కొన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కూడా కల్పించాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే సోనూసూద్ చేసిన సాయాలు చాలానే ఉన్నాయి. అందుకే ఆయనను అంతా రియల్ హీరో అని పొగిడారు. సోషల్మీడియాలో ఆయన ఖ్యాతీ పెరిగిపోయింది. కాగా ప్రస్తుతం సోనూసూద్ మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ‘ఆచార్య’ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో సోనూ సూద్ బిజీగా ఉన్నారు. కాగా అదే సినిమా సెట్లో ప్రముఖ నటుడు దర్శకుడు తనికెళ్ల భరణి డైరెక్టర్ కొరటాల శివ కరోనా బాధితులకు సోనూసూద్ చేసిన సేవలకు గాను ప్రత్యేకంగా సత్కరించారు. పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని కూడా బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య టీమ్ సభ్యులు కూడా పాల్గొన్నారు.

కరోనా టైంలో సోనూసూద్ పేదలకు ఆదుకొని ఎందరికో స్ఫూర్తినిచ్చారని తనికెళ్ల భరణి కొనియాడారు. ఈ సంద్భంగా సోనూసూద్ మాట్లాడుతూ ముంబై కంటే దక్షిణాది సినిమాల్లో నటించేటప్పుడే తనకు ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుందని ఇక్కడ ప్రేక్షకులు అందించే ప్రేమను మాటల్లో చెప్పలేననన్నారు.