సోలో బ్రతుకే సో బెటర్ టీజర్ టాక్

0

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కెరీర్ పరంగా బౌన్స్ బ్యాక్ అయినాట్టేనా? అంటే రెండు వరుస విజయాలు అతడికి పెద్ద ఊరటనిచ్చాయనే చెప్పాలి. చిత్రలహరి – ప్రతిరోజూ పండగే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా సేఫ్ అవ్వడంతో అతడికి కొంత బూస్ట్ దొరికినట్టయ్యింది. బ్లాక్ బస్టర్లు .. సెన్సేషన్ హిట్ల మాట లేకపోయినా మార్కెట్ వర్గాల్లో సంతృప్తిని మిగల్చడంలో సఫలమయ్యాడు. ఇక ఇదే ఉత్సాహంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే ధ్యేయంగా కొత్త పంథా స్క్రిప్టుల్ని ఎంచుకుంటున్నాడు.

ఆ కోవలోనే సాయి తేజ్ చేస్తున్న తాజా ప్రయత్నం `సోలో బ్రతుకే సో బెటర్`. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ కథానాయికగా నటిస్తోంది. బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ సహా పోస్టర్లకు స్పందన బావుంది. తాజాగా ప్రేమికుల రోజు కానుకగా చిత్ర యూనిట్ మూవీ థీమ్ వీడియోను రిలీజ్ చేసింది. ఎంతో ఎంటర్టైన్మెంట్ ఫన్ ఎలిమెంట్ ఉన్న ఈ వీడియో యువతరంలోకి దూసుకెళుతోంది.

టీజర్ కొన్ని సెకన్ల పాటు సాగినా.. అందులో సాయి తేజ్ డైలాగ్ మురిపించింది. “కష్టం ఇష్టం విచారం సంతోషం ఆనందం బాధ ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్ అలాగే ప్రేమ అనేది కూడా ఓ పీలింగే కదా.. మారదని గ్యారెంటీ ఏంటి?“ అంటూ సాయితేజ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. “సోలో సోదర సోదరీమణులారా.. ఈ వేలెంటైన్స్ వీకెండ్ని మనం అంతా కలిపి జరుపుకుందాం.. మన నినాదం ఒకటే.. సోలో బ్రతుకే సో బెటర్“ అంటూ అసలు సినిమా థీమ్ ఏమిటో రివీల్ చేసేశారు.

ఇక నేపథ్యంలో మదర్ థెరీసా.. వాజ్ పేయ్..లతాజీ లాంటి ప్రముఖుల ఫోటోల్ని చూపించి సోలో లైఫ్ లో మహనీయులు అన్న మీనింగుని కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇదో పూర్తి స్థాయి ఎంటర్ టైనర్ అని అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే1న విడుదల చేస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం.. రీరికార్డింగ్ ఈ సినిమాకి ప్రధాన అస్సెట్ కానున్నాయి. మునుముందు పోస్టర్ ట్రీట్.. సింగిల్స్ ట్రీట్.. ట్రైలర్ ట్రీట్ ఇవన్నీ ఉండనున్నాయి.
Please Read Disclaimer