రేప్ జరుగుతుంటే సాక్ష్యాలు కాపాడుకోవాలా?

0

గత ఏడాది బాలీవుడ్ ను మొత్తం షేక్ చేసిన విషయం మీటూ. చాలా మంది హీరోయిన్స్.. సింగర్స్ ఇంకా పలు విభాగాలకు చెందిన ఆడవారు మీటూ ఆరోపణలు చేశారు. ప్రముఖ స్టార్స్ మరియు డైరెక్టర్స్ కూడా మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ఉన్నారు. చాలా మంది మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో సినిమాల నుండి తప్పించినట్లుగా అనిపించినా మళ్లీ వారిని ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాల్లోకి తీసుకుంటున్నారు. ఇటీవల అను మాలిక్ కు కూడా ఛాన్స్ దక్కింది.

గాయని సోనా మొహాపాత్ర గత ఏడాది ప్రముఖ స్టార్ సింగర్ అను మాలిక్ పై మీటూ ఆరోపణలు చేసింది. అను తనను లైంగికంగా వేదించాడు అంటూ సోనా సంచలన ఆరోపణలు చేసింది. పలు సార్లు నన్ను మానసికంగా మరియు శారీరకంగా ఇబ్బంది పెట్టాడంటూ తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. సోనా తర్వాత మరికొందరు కూడా అను మాలిక్ పై మీటూ ఆరోపణలు చేశారు. చాలా మంది మీటూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన చేస్తున్న ఇండియన్ ఐడల్ నుండి తప్పించారు.

గత సీజన్ మద్యలోనే ఆయన్ను తప్పించిన నిర్వాహకులు మళ్లీ ఆయన్ను జడ్జ్ గా పెట్టుకున్నారు. గత సీజన్ లో అను మాలిక్ ను మద్యలోనే తొలగించడంతో పాటు సోనా మొహాపాత్రను కూడా నిర్వాహకులు తొలగించారు. అప్పుడు తొలగించి మళ్లీ ఇప్పుడు ఎంపిక చేసుకోవడంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతుంది. తాను అతడు చేసిన లైంగిక వేదింపులను నోరు కొట్టుకుని మరీ చెబుతున్నా కూడా మీకు చెవికి ఎక్కడం లేదా అంటూ ప్రశ్నించింది.

నేను ఎప్పుడు మీటూ ఆరోపణలు చేసినా కూడా సాక్ష్యాధారాలు చూపించాలని చాలా మంది అంటున్నారు. రేప్ జరుగుతున్నప్పుడు సాక్ష్యాలను కాపాడుకునేందుకు ఎవరైనా చూస్తారా అంటూ సోనా సీరియస్ గా స్పందించింది.
Please Read Disclaimer