వాడిపై కేసు పెట్టాలి కాని పబ్లిసిటీకి వాడుకున్నారు

0

ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు అను మాలిక్ పై గత సంవత్సర కాలంగా మీటూ అంటూ లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తున్న సింగర్ సోనా మొహాపాత్ర మరోసారి మీడియా ముందుకు వచ్చింది. అను మాలిక్ పై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ ఆయనపై ఆరోపణలతో దాడి చేస్తున్న సోనా ఈసారి ఆయన జడ్జ్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ సింగింగ్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఆ షో ప్రసారం అవుతున్న ఛానల్ పై తీవ్ర విమర్శలు చేసింది.

ఇటీవల ఆ షోలో ఒక జడ్జ్ గా వ్యవహరిస్తున్న నేహా కక్కర్ పై కంటెస్టెంట్ ఒకతను స్టేజ్ పైనే బలవంతంగా ముద్దు పెట్టాడు. నడుం పట్టుకుని బలంగా లాగి ముద్దు పెట్టిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నేహా కక్కర్ ఈ విషయాన్ని లైట్ తీసుకుంది. అభిమానంతో అతడు అలా చేశాడంటూ ఊరుకుంది. కాని ఆమద్య తనూశ్రీ దత్తా అతడిపై కేసు పెట్టాలంటూ నేహా కక్కర్ కు సూచించింది. ఇటీవల సోనా మొహాపాత్ర కూడా అతడి తీరుపై విరుచుకు పడింది. అలాంటి వ్యక్తిపై కేసు పెట్టి అరెస్ట్ చేయించాలంది.

అలాంటి వ్యక్తులను క్షమించడం వల్లే ప్రస్తుత పరిస్థితి ఇలా ఉందంటూ నేహా ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై కేసు పెట్టక పోగా ఛానెల్ ప్రమోషన్ కోసం.. షో టీఆర్పీ రేటింగ్ కోసం ఆ వీడియోను ప్రసారం చేశారంటూ నేహా అంది. ఆ వీడియోను వైరల్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని.. ఇలాంటి పరిణామాలు అస్సలు మంచిది కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఛానెల్స్ టీఆర్పీ కోసం ఇంతకు దిగజారడం దారుణమంటూ ఆమె కామెంట్ చేసింది.

ఇక మరోసారి అను మాలిక్ పై సోనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల అను మాలిక్ ఇండియన్ ఐడల్ షోకు బ్రేక్ తీసుకున్నాడు. తన ఆరోపణల వల్లే ఆయన బ్రేక్ తీసుకున్నాడని.. ఇది తన విజయం అంటూ సోనా చెప్పుకొచ్చింది. ఇక అనుమాలిక్ మనుషులు నాకు ఈమద్య ఫోన్ చేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని.. డబ్బులు కావాలంటూ ఇస్తామంటూ మాట్లాడుతున్నారు. నాకు డబ్బులు అక్కర్లేదు న్యాయం కావాలంటూ తాను అనుమాలిక్ పై చట్టపరమైన చర్యలకు సిద్దం అవుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.
Please Read Disclaimer