సల్మాన్ ఓ విషపూరిత వ్యక్తి.. ఇదో పెద్ద కదలిక: ప్రముఖ సింగర్ వ్యాఖ్యలు

0

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఇండస్ట్రీ మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున నెపోటిజం పై విమర్శలు కురిపిస్తున్నారు. వారం రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న సెలబ్రిటీలలో హీరో సల్మాన్ ఖాన్ కూడా ఒకరు. సుశాంత్ మృతితో ఓ వారం రోజులుగా సల్మాన్ ఖాన్ ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతున్నాడు. సుశాంత్ అభిమానులు సల్మాన్ పై ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే సుశాంత్ మరణం పై సల్మాన్ ఖాన్ స్పందించి.. “నా ఫ్యాన్స్ అందరికీ ఒక రిక్వెస్ట్. సుశాంత్ ఫ్యాన్స్ కు సపోర్ట్ చేయండి. వాడిన భాష పెట్టిన శాపాలను పట్టించుకోకుండా దానికి వెనుక ఉన్న ఎమోషన్ ను అర్థం చేసుకోండి. అతని కుటుంబానికి అభిమానులకు సపోర్ట్ చేయండి. ప్రియమైన వాళ్లు కోల్పోతే నిజంగా అది చాలా బాధగా ఉంటుంది’ అని ట్వీట్ చేశాడు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ గాయని సోనా మహాపాత్ర మరోసారి సల్మాన్ పై వ్యగ్యాస్త్రాలు విసిరింది. సోనా ఇప్పటివరకూ పాడిన పాటల కన్నా.. ట్విట్టర్లో వివాదాస్పద ట్వీట్లతోనే ఎక్కువగా విమర్శలకు గురవుతూ వస్తుంది. విమర్శలను కొని తెచ్చుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తాజాగా మరో మారు ట్విట్టర్ లో సల్మాన్ ఖాన్ పై చెలరేగి పోయిందనే చెప్పాలి. సోనాకి బాలీవుడ్ కండలవీరునిపై విమర్శలతో ట్వీట్లు చేయడం సోనాకి కొత్తేమి కాదు. సుశాంత్ ఫ్యాన్స్ కి తన ఫ్యాన్స్ అండగా ఉండాలన్న సల్మాన్ ట్వీట్ పై.. ‘విషపూరిత స్వభావం కలిగిన.. అలాగే మనసెరిగిన ఓ వ్యక్తి నుంచి ఇదొక పెద్ద కదలిక. అతని డిజిటల్ పెయిడ్ ఆర్మీ గతంలో ఇతరులను ఇలా బెదిరించినపుడు ఇలాంటి ఓ ట్వీట్ లేదా క్షమాపణ అవసరమని అతను ఎందుకు భావించలేదు` అని సోనా వివాదాస్పదంగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం సోనాను ట్రోల్ చేసే పనిలో సల్మాన్ ఫ్యాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.
Please Read Disclaimer