బూతులు తిట్టినా ఫీలవ్వని బ్యూటీ

0

అనవసరమైన కారణాలతో తనని తిట్టినంత మాత్రాన వాటికి స్పందించాల్సిన అవసరం లేదని షాట్ గన్ వారసురాలు సోనాక్షి సిన్హా అంటోంది. అంతేకాదు తనని తిట్టేవారిపై సైలెంటుగా అదిరిపోయే పంచ్ కూడా వేసింది. ప్రస్తుతం అభిమానుల్లో దీనిపై వేడెక్కించే చర్చ సాగుతోంది. ఇంతకీ సోనాక్షి తానేమీ ఫీలవ్వకుండానే ఎదుటివారు ఫీలయ్యేలా వేసిన ఆ పంచ్ ఏమిటి? అంటే.. వివరాల్లోకి వెళ్లాల్సిందే.

ప్రస్తుతం ఈ అందాల భామ ఓ రియాలిటీ షో జూరీలో జడ్జిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇండియాలోనే తొలి డిజిటల్ షో.. ఈ వేదికగా తనపై వచ్చే ట్రోల్స్ గురించి సోనాక్షి స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు ఓ సందేశం ఇచ్చిందట. “నన్ను అనుసరించే వాళ్లు .. నా బరువు గురించి తిట్టే వాళ్లు అందరికీ ఒకటే చెబుతున్నా. నేను ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ట్రోల్ చేసిన వారి కంటే మంచి స్థాయిలోనే ఉన్నాను“ అని తెలిపింది. నన్ను మించిన గొప్పవాళ్లు నన్ను తిడితే తప్పేమీ లేదు కానీ `తక్కువ స్థాయి వాళ్లు!!` తిడితే పట్టించుకుంటానా? అంటూ లైట్ తీస్కుందట.

ఈ సంవత్సరం అంతా ప్రత్యేకించి తన వ్యతిరేకులపైనా.. బాడీ షేమింగ్ క్యారెక్టర్ల పైనా సోనాక్షి దృష్టి సారించిందట. అందులో తనని బూతులు తిట్టినవాళ్లు ఉన్నారు. ఇష్టానుసారం ద్వంద్వ పదజాలంతో తిట్టిన వాళ్లు ఉన్నారు. అందుకే తనని కావాలని టార్గెట్ చేసి తిట్టిపోసే వాళ్లను పట్టించుకోకూడదని అనుకుందట. అలా చేయడం వల్ల తనకు మేలే జరిగింది. ఉన్నమాట అనేసినంత మాత్రాన దానికి ఫీలవ్వాల్సిందేమీ లేదని షాక్ ట్రీటిచ్చింది. సోనాక్షి ప్రస్తుతం దబాంగ్ 3లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home