సోనాక్షి ఫోజ్ కు ఫ్యాన్స్ మతి పోతుంది

0

బాలీవుడ్ స్టార్ కిడ్ దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఫిజిక్ కు ఎంతో మంది అభిమానులు ఉంటారు. హీరోయిన్ అంటే నాజూకుగా పొట్టిగా ఉంటారు. కాని సోనాక్షి సిన్హా మాత్రం మంచి ఫిజిక్ తో పాటు ఆకట్టుకునే రూపంతో చూడగానే వావ్ అనేట్లుగా ఉంటుంది. స్టార్ వారసురాలిగా పరిచయం అయినప్పటికి అతి తక్కువ సమయంలోనే ఆమె తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయన్స్ పోటీని తట్టుకుని స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. గత పదేళ్లుగా ఈ అమ్మడి బాలీవుడ్ జర్నీ కొనసాగుతోంది.

సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లు మరియు టీవీ షోలను కూడా చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం హాట్ ఫొటో షూట్స్ ను రెగ్యులర్ గా షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఆమె రొమాంటిక్ ఫోజ్ కు అభిమానులు మతి పోయినట్లుగా ఉంది అంటున్నారు. గత ఏడాది ఏకంగా ఆరు సినిమాలు చేసిన ఈ అమ్మడు ఈ ఏడాది కరోనా లేకుంటే ఖచ్చితంగా నాలుగు అయిదు సినిమాలు అయినా చేసేది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అవి వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సినిమాలు లేకున్నా తన ఫొటో షూట్స్ మరియు సెల్ఫీలతో అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది.