బాలకృష్ణతో జోడీ కట్టనున్న బాలీవుడ్ భామ?

0

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా కెయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో ఇంకా హీరోయిన్లు ఎంపిక చేయలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ ను ఫైనలైజ్ చేశారట.

సోనాల్ చౌహాన్ తో జోడీ కట్టడం బాలయ్యకు ఇది మొదటిసారేమీ కాదు. గతంలో బాలయ్య నటించిన ‘లెజెండ్’.. ‘డిక్టేటర్’ చిత్రాల్లో సోనాల్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బాలయ్య-సోనాల్ జోడీ ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సినిమాలో బాలయ్య డబల్ రోల్ లో కనిపిస్తాడని.. ఒక పాత్ర పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయితే మరో పాత్ర గ్యాంగ్ స్టర్ గా ఉంటుందని టాక్. గ్యాంగ్ స్టర్ పాత్ర కోసం బాలయ్య గడ్డం పెంచి డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు.

కెయస్ రవికుమార్ – బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న రెండవ సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘జైసింహా’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. సీ. కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer