ముంబై వానలో తడుస్తున్న పాప

0

బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ పేరు తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి తెలిసే ఉంటుంది. ‘సైజ్ జీరో’ లో సెకండ్ హీరోయిన్. బాలయ్య సినిమాలు ‘లెజెండ్’.. ‘డిక్టేటర్’ లో కూడా నటించింది. రామ్ సూపర్ హిట్ ఫిలిం ‘పండగ చేస్కో’ లో హీరోయిన్. హిందీలో కూడా కొన్ని సినిమల్లో నటించింది కానే అవేవీ సూపర్ హిట్లు కాలేదు. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. రెగ్యులర్ గా ఏదో ఒక హాటు ఫోటో పోస్ట్ చేసి నెటిజన్ల కళాపోషణకు తన వంతు సహాయం చేస్తుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ హీటు పెంచే కార్లోయక్రమంలో భాగంగా ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “వానను మిమ్మల్ని ముద్దాడనివ్వండి. #మాన్సూన్స్ #ముంబై” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలో సోనాల్ వైట్ పోల్కా డాట్స్ ఉన్న రెడ్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ ధరించి వానలో తడుస్తూ పోజిచ్చింది. ఒక ఫోటోలో కళ్ళు మూసుకొని.. రెండు చేతులను ఒక తత్వవేత్తలాగా కొంచెం పైకెత్తి రెయిన్ కిస్సులను ఆస్వాదిస్తూ పోజిచ్చింది. మరో ఫోటోలో మెడపై చేతులు పెట్టుకుని పోజిచ్చింది. ఎంతో టాలెంట్.. ఎంతో ప్రకృతి ఆరాధన లేకపోతే ఇలా న్యాచురల్ రెయిన్ లో ఫోటో తీసుకోవాలని.. ఇలా ప్రకృతిలో మమేకమైపోతూ పోజివ్వాలని అనిపిస్తుంది చెప్పండి?

నెటిజన్లకు ఈ ఫోటోలు తెగ నచ్చాయి. “స్టన్నింగ్ పోజ్.. పర్ఫెక్ట్ టైమింగ్”.. “నువ్వు వానలాగే అందంగా ఉన్నావు”.. “నేను వాననైనా కాకపోతిని” అంటూ కామెంట్లు పెట్టారు. కానీ ఒక నెటిజన్ మాత్రం “నీకేమో ఇది రెయిన్ కిస్సు.. బిహార్.. అస్సాం లో రెయిన్ జనాలను రేప్ చేస్తోంది” అంటూ కాస్త ఘాటు కామెంట్ పెట్టాడు. ఇక సోనాల్ ఫ్యూచర్ సినిమాల విషయానికి వస్తే బాలయ్య – కెయస్ రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో సోనాల్ ను ఒక హీరోయిన్ గా ఎంపిక చేశారట.
Please Read Disclaimer