రూలర్ కోసం రెచ్చిపోయిన సోనాల్

0

నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన ‘రూలర్’ టీజర్ నిన్నే విడుదలైంది. ఈ టీజర్ ఆద్యంతం బాలయ్య విశ్వరూపమే ప్రధానంగా సాగింది కానీ మధ్యలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ గ్లామర్ ఝలక్ లు కూడా ఉన్నాయి. టీజర్ లో ఒక షాట్ లో సోనాల్ అందాలు ఆరబోస్తూ ఈతకొలను నీటిలో నుండి అలా రొమాంటిక్ గా పైకి లేస్తుంది. దీంతో ‘రూలర్’ లో సోనాల్ గ్లామర్ ఓ అదనపు ఆకర్షణ అని మన ఫిక్స్ అయిపోవచ్చు.

సోనాల్ బాలయ్యతో నటించడం ఇది ముచ్చటగా మూడోసారి. తొలిసారి బాలయ్యతో ‘లెజెండ్’ సినిమాలో నటించింది. ఆ సినిమా హిట్ కావడంతో సోనాల్ ఖాతాలో ఒక హిట్ చేరింది. అ సినిమా తర్వాత ‘డిక్టేటర్’ లో కూడా హీరోయిన్ గా నటించింది.. గ్లామరసం చిందించింది. ఇప్పుడు బాలయ్యతో హ్యాట్రిక్ సినిమా కావడంతో మరోసారి అందాల ప్రదర్శనకు సై అంది. హీరోయిన్లు బికినీలు వేసుకుంటే ఎవరు చూస్తారు అని కొందరు చచ్చుపుచ్చు వాదన వినిపిస్తారు కానీ ‘డీజె’ లో బికినీ షో తర్వాతే పూజా హెగ్డే క్రేజీ హీరోయిన్ గా మారింది. నిజానికి ఆ సినిమాలో పూజా గ్లామర్ ఒక హైలైట్. అలాగే ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటుందేమో వేచి చూడాలి.

ఈ సినిమా హిట్ అయితే మాత్రం సోనాల్ కు మంచి ఆఫర్లు రావడం ఖాయం. ఎందుకంటే సీనియర్ స్టార్ల సరసన సరైన జోడీగా కనిపించే హీరోయిన్లు టాలీవుడ్ లో చాలా తక్కువ మంది ఉన్నారు. మరోవైపు టాలీవుడ్ లో సీనియర్ స్టార్ల సంఖ్య ఎక్కువే. ‘రూలర్’ కనుక హిట్ అయితే సోనాల్ కెరీర్ మలుపు తిరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి
Please Read Disclaimer