సోనాలి దీపావళి సెలబ్రేషన్

0

బాలీవుడ్ మాజీ హీరోయిన్ సోనాలి బింద్రే క్యాన్సర్ తో బాధ పడుతున్న విషయం తెల్సిందే. క్యాన్సర్ కారణంగా మృత్యువుతో పోరాడుతున్నా కూడా సోనాలి మాత్రం మనో ధైర్యం కోల్పోవడం లేదు. ఆమె చాలా పట్టుదలతో క్యాన్సర్ తో పోరాడుతూనే ఉంది. గత కొన్ని నెలలుగా అమెరికాలోని న్యూయార్స్ లో క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్న సోనాలి తన జట్టును కూడా కోల్పోయింది. తన జీవితంలో జరుగుతున్న ప్రతి అప్ డేట్ ను సోషల్ మీడియా ద్వారా తన వారికి – తన అభిమానులకు తెలియజేస్తూనే ఉంది.

క్యాన్సర్ చికిత్స నిమిత్తం విదేశాల్లో ఉన్నా కూడా సోనాలి అక్కడ ముఖ్యమైన పండుగలు మరియు వేడుకలు నిర్వహించుకుంటూనే ఉంది. తాజాగా దీపావళి వేడుకను అక్కడే భర్త మరియు కొడుకుతో కలిసి జరుపుకుంది. దీపావళి వేడుక ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ముంబయి కంటే కాస్త ఆలస్యంగా న్యూయార్క్ లో దీపావళి వేడుక జరుపుకున్నాను అంటూ ఆమె పోస్ట్ చేసింది.

క్యాన్సర్ వంటి మహమ్మారితో పోరాడుతూ చాలా నిబ్బరంగా ఉన్న సోనాలి బింద్రే త్వరగా క్యాన్సర్ నుండి కోరుకోవాలంటూ ఆమెకు ఫ్యాన్స్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే దీపావళికి ముంబయిలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని పండుగ ముంబయిలో సంతోషంగా జరుపుకోవాలంటూ ఒక అభిమాని అంటూ సోనాలికి శుభాకాంక్షలు తెలియజేశాడు.
Please Read Disclaimer