నటవారసుల ఈగోయిస్టిక్ క్యారెక్టర్

0

బాలీవుడ్ లో ఎన్నడూ లేనంతగా నటవారసత్వం (నెప్టోయిజం) గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య అనంతరం నెటిజనుల్లో ప్రముఖంగా హైలైట్ అయిన టాపిక్ ఇది. ఇప్పటికీ నెపోటిజం గురించి నెటిజనులు డిబేట్ కొనసాగిస్తూనే ఉన్నారు. బాలీవుడ్ అంటే కొన్ని కుటుంబాల స్టార్లకే అంకితం! అంటూ ప్రచారమైంది. తాజాగా ఆ అక్కా చెల్లెళ్లు ఇరువురూ ఇది నిజమేనని మరోసారి నిరూపించారు. సోదరి కరిష్మా కపూర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోనమ్ కపూర్ అహుజా సోషల్ మీడియాలో ఇచ్చిన సందేశంపై మరోసారి నెపోటిజం వ్యాఖ్యలు చేస్తూ నెటిజనులు చెలరేగిపోవడం చూస్తుంటే ఇది ఇప్పట్లో ఆరని జ్వాల అనే అర్థమవుతోంది.

“హ్యాపీ బర్త్ డే కరిష్మా .. నువ్వు ఎంతో శ్రమించి సవాళ్లతో సంబంధం లేకుండా విజయాలు సాధించి మాకు స్ఫూర్తిగా నిలిచావు. అదే మాకు ప్రేరణ .. సినిమాల్లో కపూర్ గాళ్స్ కి మార్గం సుగమం చేసినందుకు కూడా ధన్యవాదాలు .. నువ్వు లేకపోతే మేమంతా ఇక్కడ ఉండలేము..లవ్ లవ్“ అంటూ సోనమ్ ఇన్ స్టాలో వ్యాఖ్యానించింది. మొత్తానికి కపూర్ గాళ్స్ లో కరీనా.. జాన్వీ లాంటి తారలు ఉద్భవించడానికి కరీనా వేసిన పునాదినే కారణమని సగర్వంగా వ్యాఖ్యానించింది నటవారసురాలు సోనమ్. వీళ్లలో తాను కూడా ఉన్నానని చెప్పకనే చెప్పింది. దానికి స్పందించిన కరిష్మా (లోలో) “అబ్బా సో స్వీట్ డార్లింగ్ సోనమ్ ధన్యవాదాలు.. నిన్ను ప్రేమిస్తున్నాను” అంటూ హార్ట్ ఈమోజీల్ని షేర్ చేసింది కరీనా.

బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా రాణించిన తొలి తరం కపూర్ గాళ్ గా కరిష్మాకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. గొప్ప డ్యాన్సింగ్ స్టార్ గా కెరీర్ తొలినాళ్లలోనే తనదైన ముద్ర వేసిన కరిష్మా అటుపై షారూక్.. సల్మాన్ సహా అగ్ర కథానాయకులందరి సరసన నటించి తారాపథంలోకి దూసుకుపోయింది. ప్రతిభతో ఎదిగిన స్టార్ గా కరిష్మా పాపులరైంది. ఆ తర్వాత తన సోదరి కరీనా నటవారసురాలిగా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేసింది. సోనమ్ కెరీర్ పరంగా అంతంత మాత్రంగానే రాణించినా ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు ఇదే కపూర్ వంశం నుంచి జాన్వీ కపూర్ రాణిస్తోంది. తదుపరి ఖుషీ కపూర్ బరిలో దిగబోతోంది. అర్జున్ కపూర్ అనే హీరో కూడా ఉన్నాడు. వీళ్లందరినీ దృష్టిలో పెట్టుకుని కపూర్ గాళ్స్ ఈగోయిస్టిక్ క్యారెక్టర్లపైనా సెటైర్లు వేస్తున్నారు నెటిజనులు.
Please Read Disclaimer