హాట్ కపుల్ కేరాఫ్ మాల్దీవ్స్

0

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ అహూజా గురించి తెలియనివారు ఎవరుంటారు చెప్పండి? అనిల్ కపూర్ గారాలపట్టిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనమ్ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘నీర్జా’ లాంటి సినిమాలతో అద్భుత నటిగా పేరు తెచ్చుకున్న సోనమ్ మరోవైపు ఫ్యాషనిస్టుగా కూడా ఇతర హీరోయిన్లకు భిన్నమని నిరూపించింది. తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ ఆనంద్ అహూజాను వివాహం చేసుకున్న తర్వాత కూడా నటనను.. ఫ్యాషన్ ను కంటిన్యూ చేస్తూ మోడరన్ బాలీవుడ్ భామ అనిపించుకుంటోంది.

సోనమ్ రీసెంట్ గా తన భర్త.. ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవ్స్ ట్రిప్ కు వెళ్ళింది.. తిరిగి ముంబైకి వచ్చేసింది. సోనమ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వ్యక్తి. ఇక ఇలాంటి సందర్భం వస్తే ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకోకుండా ఉంటుందా? అందుకే తన భర్తతో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేసుకుంది. ఈ ఫోటోకు “మ్యాజికల్ మాల్దీవ్స్. మామూలుగానే నాకు బీచులంటే పిచ్చి. ఇక నా ప్రియమైన వ్యక్తులతో కలిసి బీచ్ లో గడిపిన సమయానికి అసలు వెలకట్టలేం” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలో భర్తగారు ఆహూజాపై చెయ్యి వేసి మరీ పోజిచ్చింది. ఆనంద్ గారు షర్టులేకుండా చిరునవ్వుతో ఉండగా.. మిసెస్ ఆనంద్ మాత్రం పెద్ద స్మైల్ ఇచ్చింది. సోనమ్ బీచ్ డ్రెస్ లోఉంది.. బికినీ కావడంతో అందాల విందులు లాంటి చాలా కామన్ ..వాటిగురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం అనవసరం.

ఇక ఈ ఫోటోకు నెటిజన్ల రెస్పాన్స్ అదిరిపోయింది. “సూపర్ హాట్ బాలీవుడ్ జోడీ”.. “హాట్ కపుల్”.. “బెస్ట్ హబ్బీ అని సోనమ్ స్మైల్ చెప్తోంది” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక సోనమ్ కపూర్ సినిమాల విషయానికి వస్తే తన లాస్ట్ సినిమా ‘ది జోయా ఫ్యాక్టర్’ సెప్టెంబర్ లో రిలీజ్ అయి దారుణ ఫలితాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత ఇంకా నెక్స్ట్ ఫిలిం సైన్ చెయ్యలేదు.
Please Read Disclaimer