స్టార్ కపుల్ జిమ్ లో రొమాంటిక్ వర్కౌట్స్

0

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ కొన్నాళ్ల క్రితం ఆనంద్ అహుజాను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరి అన్యోన్యం అందరికి తెల్సిందే. ఎక్కడకు వెళ్లినా జంటగా వెళ్లడంతో పాటు ఎంత మంది ఉన్నా కూడా చాలా రొమాంటిక్ గా ఉంటారు. వీరిద్దరి అన్యోన్యంకు బాలీవుడ్ కు చెందిన ఇతర కపుల్స్ కూడా కుళ్లుకుంటూ ఉంటారేమో అంటూ సోనమ్ కపూర్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉంటారు.

వీరిద్దరి జోడీ అద్బుతంగా ఉంటుందని సోషల్ మీడియా టాక్ ఉంది. ఎప్పటికప్పుడు వీరి లవ్ మరియు ఎంజాయ్ మెంట్ మూమెంట్స్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూనే ఉంటారు. ఆనంద్ ఆహుజాకు సోనమ్ కపూర్ అంటే చాలా ప్రేమ. ఆ విషయాన్ని ఆయన రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వీడియోలు మరియు ఫొటోల ద్వారా తెలుస్తూనే ఉంటుంది. తాజాగా వీరిద్దరు జిమ్ లో రొమాంటిక్ గా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆనంద్ అహుజా మరియు సోనమ్ కపూర్ లు జిమ్ కు వెళ్లారు. అక్కడ సోనమ్ కపూర్ ను కౌంగింలించుకుని ఆనంద్ సరదాగా టీజ్ చేస్తున్నట్లుగా ఉంది. సోనమ్ అతడి నుండి వినిపించుకుంది. ఈ వీడియో ప్రస్తతం సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతుంది.
Please Read Disclaimer