సోనమ్ అలా ఫైరైపోయిందేమిటి?

0

ప్యారిస్ కే మతిచెడే ట్రీట్ ఇవ్వాలంటే ఫ్యాషనిస్టా సోనమ్ తర్వాతనే. కపూర్ గాళ్ నెవ్వర్ బిఫోర్ డిజైన్స్ తో సెగలు పుట్టిస్తూ సోషల్ మీడియాని హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సోనమ్ రెగ్యులర్ ఫోటో ట్రీట్ పై అభిమానుల్లో నిరంతరం ఆసక్తికర చర్చ సాగుతోంది. కథానాయికగా కెరీర్ నెమ్మదిగా సాగుతోంది. ఆ క్రమంలోనే వాణిజ్య ప్రకటనలు.. మోడలింగ్ అసైన్ మెంట్స్ తో బిజీగా ఉంటోంది. అలాగే అప్పుడప్పుడు వివాదాలతో అంటకాగి ఈ అమ్మడు నెటిజనులతో అక్షింతలు వేయించుకోవడంపై ఫ్యాన్స్ లో చర్చ సాగుతోంది.

ఇంతకుముందు రకరకాల వివాదాల్లో తలదూర్చి సోనమ్ ఇబ్బందుల పాలైంది. సోషల్ మీడియా ట్రోల్స్ తనకు పెద్ద సమస్యగా మారాయి. సోనమ్ తండ్రి అనీల్ కపూర్ .. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో కలిసి దిగిన ఓ పాత ఫోటో సామాజిక మాధ్యమాల్లో కి రావడంతో సోనమ్ ట్రోల్స్ కి గురైంది. అయితే దానికి కౌంటర్ గా సోనమ్ అదిరిపోయే సమాధానం ఇచ్చింది.

“మా నాన్న గారు రాజ్ కపూర్.. క్రిష్ణా కపూర్ తో కలిసి ఇండియా ఆడే క్రికెట్ మ్యాచ్ కి వెళ్లారు. ఆ పక్కనే ఎవరున్నారో తెలియకుండానే ఆ ఫోటోని తీశారు. అయినా ఇలా ఒకరిపై వేలెత్తి చూపడం ఆపండి. ఎందుకంటే మిగతా మూడు వేళ్లు మీ వైపే చూపిస్తాయి. ఇలాంటి ద్వేషపూరిత ఆలోచనలు ఉన్న మీలాంటివారిని ఆ శ్రీరాముడు క్షమించాలని కోరుకుంటున్నాను“ అని సోనమ్ వ్యాఖ్యానించింది. ది జోయా ఫ్యాక్టర్ తర్వాత సోనమ్ కె అహూజా సినిమాలకు దూరంగా ఉంటోంది. దానికి కారణమేంటో తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer