సోనమ్ కు తప్పని ట్రోల్స్..!

0

‘లోకోభిన్నరుచి’ అని ఒక పా..త సామెత ఉంది. అంటే ఒక్కోడి టేస్ట్ ఒక్కోరకంగా ఉంటుందని దానర్థం. అందుకే మనకు విపరీతంగా నచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను మన కజిన్ చూసి సింపుల్ గా నచ్చలేదు అని తేల్చేయొచ్చు. తనకు కమ్ములసారు సినిమా ‘ఫిదా’ ఇంకా ఎక్కువగా నచ్చిందని చెప్పొచ్చు. హీరోయిన్ల డ్రెసింగ్ అయినా అంతే.. మనకు నచ్చింది ఇతరులకు నచ్చాలని లేదు. అలానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనం కపూర్ కు ఈమధ్య కాస్త ట్రోలింగ్ హీట్ తగిలింది.

సోనమ్ ఈమధ్య హలో మ్యాగజైన్ వారు నిర్వహించిన హలో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ 2019 ఫంక్షన్ లో పాల్గొంది. ఆ కార్యక్రమంలో సోనమ్ కు ‘ట్రెయిల్ బ్లేజర్ పెర్ఫామర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రదానం చేశారు. ఈ వేడుకకు ఎప్పటిలాగే ఒక స్టైలిష్ డ్రెస్ లో హాజరయింది. సోనమ్ డ్రెస్ డిజైన్ చేసినవారు ఎవరో కాదు సోనమ్ చెల్లి రియా కపూర్. సోనమ్.. రియా ఇద్దరూ కలిసి ‘రేసన్’ అనే ఫ్యాషన్ బ్రాండ్ క్లోతింగ్ బిజినెస్ లో ఉన్నారు. సరే కానీ.. మన టాపిక్ అది కాదు. సోనమ్ డ్రెస్ డీప్ వీ నెక్ గ్రీన్ కలర్ గౌన్ కావడంతో క్లీవేజ్ షో ఆటోమేటిక్ గా జరిగిపోయింది. చాలామంది డ్రెస్ సూపర్ గా ఉందని.. సోనమ్ హాట్ గా ఉందని ప్రశంసలు కురిపించారు కానీ కొందరు నెటిజనులు మాత్రం ట్రోలింగ్ మొదలు పెట్టారు.

అసలు పెళ్ళైన తర్వాత ఆ క్లీవేజ్ షో ఏంటని మందలించారు. కొందరేమో ఆ డ్రెస్ నీకు సూట్ కాలేదు.. నీకు సెట్ అయ్యే డ్రెస్ లు వేసుకొని ఫంక్షన్లకు హాజరవ్వు… సూట్ కాని దుస్తుల్లో బయటకు రాకు అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. నిజానికి సోనమ్ కపూర్ కు బాలీవుడ్ ఫ్యాషనిస్టా అని పేరు. మరి ఆమె డ్రస్ బాగాలేదు.. స్టైల్ బాగాలేదని కామెంట్ చేస్తే ఏం చేస్తాం? అయినా ఇలాంటివి ఏమాత్రం పట్టించుకునే రకం కాదు సోనమ్.