ఫ్యాషనిస్టా సోనమ్ స్టన్నింగ్ లుక్

0

సోనమ్ కె అహుజా.. పరిచయం అవసరం లేని పేరు ఇది. బాలీవుడ్ ఫ్యాషనిస్టాగా అందరికీ సుపరిచితం. సోదరి రియా కపూర్ తో కలిసి ఫ్యాషన్ ప్రపంచంలో ఎంటర్ ప్రెన్యూర్ గానూ సత్తా చాటుతోంది. ఇక రెగ్యులర్ స్టైల్ అండ్ స్టేట్ మెంట్స్ తో సోనమ్ నిరంతరం యువతరంలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు అధునాతన ఫ్యాషన్స్ ని అనుసరిస్తూ సోనమ్ ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంది.

తాజాగా సోనమ్ న్యూ దిల్లీలో జరిగిన ఇండియా ఆర్ట్ ఫెయిర్కు హాజరైంది. అక్కడ ఈ అమ్మడు ప్రత్యక్షమైన తీరుకు కుర్రకారు స్పెల్ బౌండ్ అయిపోయారంతే. రొటీన్ సాంప్రదాయ విధానాలకు స్వస్థి చెప్పి సోనమ్ సరికొత్త లుక్ తో కనిపించింది. టాప్ టు బాటమ్ ఆల్-బ్లాక్ లుక్ లో కనిపించి సోనమ్ షాక్ నిచ్చింది. బ్లాక్ బ్లేజర్ లుక్ తో మైమరిపించింది. బ్లాక్ అండ్ బ్లాక్ సూటు.. పొడవాటి బూట్లతో సరికొత్తగా కనిపించిన సోనమ్ ఆ మెడలో నల్ల కండువాను బిగించింది. ఇక బ్రాలెస్ పోష్ లుక్ యూత్ లోకి దూసుకెళ్లిపోయింది. ఆ స్టైలిష్ డ్రెస్ కి తగ్గట్టే బ్లాక్ గ్లాసెస్ తో అల్టిమేట్ ఫ్యాషన్ ని ఎలివేట్ చేసింది.

సోనమ్ కెరీర్ సంగతి చూస్తే గత ఏడాది సోనమ్ చివరిసారిగా అభిషేక్ శర్మ తెరకెక్కించిన `ది జోయా ఫాక్టర్`లో నటించింది. దుల్కార్ సల్మాన్ సరసన ఈ చిత్రంలో స్క్రీన్ను పంచుకుంది. అనుజా చౌహాన్ రచన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక 2020లో పూర్తిగా ఫ్యాషన్ ఈవెంట్లకే అంకితమైన సోనమ్ మరో సినిమా గురించి తాజా సమాచారం ఏదీ చెప్పనే లేదు.