పింక్ డ్రెస్ లో చంపుతున్న సోనమ్

0

అనిల్ కపూర్ కూతురిగా బాలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కపూర్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ లీగ్ లోకి చేరిపోయింది. ఫ్యాషన్ కు కేరాఫ్ ఆడ్రెస్ గా ఉంటూనే ‘నీర్జా’ లాంటి సినిమాలతో మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది. బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహూజాతో వివాహం అయిన తర్వాత కూడా సోనమ్ గ్లామర్ ప్రదర్శనలను ఆపలేదు. ఒకవైపు మ్యాగజైన్ ఫోటోషూట్లు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో టెంపరేచర్లు పెంచే కార్యక్రమం చేపడుతూ ఉంటుంది.

ఏవైనా ఫిల్మీ ఈవెంట్లు జరిగినప్పుడు సోనమ్ తనలోని గ్లామర్ టాలెంట్ ను పూర్తిగా బయటకు తీసి జనాలను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ఈమధ్య అలాగే ముంబైలో ఒక కార్యక్రమానికి హాజరయింది. ఆ కార్యక్రమానికి పింక్ స్లీవ్ లెస్ డ్రెస్ లో హాజరైంది. తలకు కొప్పు.. వేలాడే ఇయర్ రింగ్స్ ధరించి యమా స్టైలిష్ గా కనిపించింది. లిప్ స్టిక్.. మస్కారా కూడా ఎక్కువగా బ్రైట్ గా లేకుండా సూపర్ గా సెట్ అయింది. అయితే నెటిజన్లను ఆకర్షించే అంశాలు ఇవి మాత్రమే కాదు. అంతకు మించి అన్నట్టుగా ఓ జంబో వీనెక్ తో హాట్ నెస్ ను రంగరించింది. ఇలాంటి ఫోటోలు చూసినప్పుడే న్యూ జనరేషన్ హీరోయిన్లు ఎంతమంది వచ్చినప్పటికీ సోనమ్ ఇప్పటికీ తన గ్లామర్ తో అందరికీ పోటీ ఇవ్వగలదు అనే విషయం అర్థం అవుతుంది.

ఇక సోనమ్ సినిమాల విషయానికి వస్తే చివరిగా ‘ది జోయా ఫ్యాక్టర్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత సోనమ్ ‘బ్యాటిల్ ఆఫ్ బిట్టోరా’ అనే సినిమాకు సైన్ చేసిందని సమాచారం.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-