ర్యాంప్ పై పింక్ మత్స్యం

0

పింక్ కి ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్న గుర్తింపే వేరు. మగువల అందాల్ని ఎలివేట్ చేసేందుకు ఇండస్ట్రీ బెస్ట్ డిజైనర్స్ పింక్ రంగునే ఉపయోగించడం రెగ్యులర్ గా చూస్తున్నదే. వరల్డ్ ఫేమస్ ఆస్కార్ పురస్కారాల వేదికపైనా పింక్ లో గుభాళించేందుకు భామలు ఉత్సాహపడుతుంటారు. 2019 ఆస్కార్స్ వేడుకలో అరడజను పైగానే భామలు పింక్ లో కనిపించి మైమరిపించారు. ఇదిగో లేటెస్ట్ గా ఫిలింఫేర్ అవార్డ్స్ 2019 వేడుకలో సోనమ్ కపూర్ ఇలా పింక్ లో తళుకుబెళుకులు ప్రదర్శించింది. పింక్ గులాబీ నవ్విందా? ర్యాంప్ పై పింక్ మత్స్యం ఒంపుసొంపులు ప్రదర్శించిందా? అన్నంతగా ఆ డ్రెస్ లో ఒదిగిపోయింది.

ఈ డ్రెస్ ని రూపొందించిన డిజైనర్ ఎవరు? అంటే సోనమ్ క్లోజ్ ఫ్రెండ్స్ .. డిజైనర్ రాల్ఫ్ & రస్సో బ్రదర్స్. స్ప్రింగ్ 2019 కలెక్షన్స్ కోసం ప్రత్యేకించి రూపొందించిన డిజైన్ ఇది అని తెలుస్తోంది. సముద్రంలో ఈదే చేపను పోలి ఉన్న డిజైనర్ డ్రెస్ పింక్ రంగు అద్దకంతో ఆకర్షణీయంగా కుదిరింది. ఇక 2019 ఫిలింఫేర్ ఉత్సవాల్లో ఎందరో భామలు వయ్యారాల వడ్డనలు చేశారు. అందరిలోనూ పింక్ బ్యూటీగా సోనమ్ లుక్ హైలైట్ అయ్యింది.

ఇక సోనమ్ కపూర్ ని కెరీర్ పరంగా పరిశీలిస్తే.. 2018 తనకు బాగా కలిసొచ్చిన సంవత్సరం. `వీరే ది వెడ్డింగ్` బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అలాగే సోనమ్ ఓ కీలక పాత్ర పోషించిన `సంజు` సైతం సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం `ది జోయా ఫ్యాక్టర్` అనే చిత్రంలో నటిస్తోంది. ఇది `ది జోయా ఫ్యాక్టర్` అనే నవల స్ఫూర్తితో రూపొందుతున్న సినిమా. మరిన్ని చిత్రాలకు సోనమ్ సంతకాలు చేసేందుకు ప్రిపేరవుతోంది.
Please Read Disclaimer