Templates by BIGtheme NET
Home >> Cinema News >> అమ్మ పాత్ర ఆఫర్ చేశారని హీరోయిన్ ఆగ్రహం

అమ్మ పాత్ర ఆఫర్ చేశారని హీరోయిన్ ఆగ్రహం


హీరోయిన్లకు కొంచెం వయసు పెరిగాక లీడ్ రోల్స్ ఆగిపోయాక ఆటోమేటిగ్గా అక్క వదిన పాత్రలకు మళ్లాల్సి ఉంటుంది. ఇంకాస్త వయసు పెరిగాక తల్లి పాత్రలు కూడా ఆఫర్ చేస్తుంటారు. ఐతే గతంలో ఎంత హవా సాగించినప్పటికీ.. వీటికి అలవాటు పడాల్సిందే. అంగీకరించాల్సిందే. కానీ అందరూ వీటిని అంగీకరిచలేరు. ‘7/జి బృందావన కాలనీ’ సహా కొన్ని సినిమాలతో తమిళ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సోనియా అగర్వాల్ ఈ విషయంలో తెగ బాధ పడిపోతోంది. తనకింకా తల్లి పాత్రలు పోషించే వయసు రాలేదని.. కానీ ఈ లోపే తనకు మదర్ క్యారెక్టర్లు ఆఫర్ చేయడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

కథానాయికగా మంచి ఫాంలో ఉండగానే ‘7/జి బృందావన కాలనీ’ దర్శకుడు సెల్వ రాఘవన్ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయిన సోనియా.. కొన్నేళ్లకే అతడి నుంచి విడిపోయింది. ఐతే అప్పటికే ఆమెను అందరూ మరిచిపోయారు. హీరోయిన్గా అవకాశాలు ఆగిపోయాయి. తర్వాత గట్టిగా ప్రయత్నిస్తే సైడ్ క్యారెక్టర్లు మాత్రమే లభించాయి. తెలుగులో ‘టెంపర్’ సహా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలే చేసింది. తమిళంలోనూ ఇలాంటి రోల్సే చేస్తోంది. ఐతే తాను ఇప్పటికీ అందంగానే హీరోయిన్ గా నటించేందుకు తగిన ఫిట్నెస్ తోనే ఉన్నానని.. ఇప్పట్లో తల్లి పాత్రల్లో నటించనని సోనియా అంటోంది.

త్రిష నయనతార తాను ఒకే సమయం లో సినీ పరిశ్రమ లోకి ప్రవేశించామని కథానాయికలు గా నటించామని అలాంటప్పుడు తనను మాత్రం అమ్మ పాత్రల్లో నటించమని దర్శక నిర్మాతలు అడుగుతుండటం ఆశ్చర్యం గా ఉందని ఆమె అంది. ఈ నిర్మాతలు దర్శకులు త్రిష నయన తారలను కూడా అమ్మ పాత్రల్లో నటించమని ఎందుకు అడగటం లేదని ప్రశ్నించింది.రాధిక ఖుష్బూల మాదిరి తనకు వయస్సు పెరిగిన తర్వాత అమ్మ పాత్రల్లో నటిస్తానని ప్రస్తుతం అమ్మ పాత్రల లో నటించే వయస్సు రాలేదని ఆమె తేల్చి చెప్పింది.