సోనూసూద్ ని చూసి అంతా బుద్ది తెచ్చుకోవాలి

0

సంపాదించినది అంతా మనకేనా? కొంత ఎదుటివాడికి కూడా ఇవ్వాలి. లేదంటే లావయిపోతామని శ్రీమంతుడు చెప్పిన డైలాగ్ ని ఎవరూ మర్చిపోలేం. కొరటాల తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ఈ డైలాగ్ ఎంతగా పాపులరైందో తెలిసిందే. మహేష్- ప్రకాష్ రాజ్ సహా కొందరు ప్రముఖులు ఊళ్లను దత్తత తీసుకుని బాగు చేశారు.

అదంతా సరే కానీ.. టాలీవుడ్ ఫేమస్ విలన్ సోనూసూద్ శ్రీమంతుడు చెప్పిన దానిని తూ.చ తప్పక ఆచరిస్తూ ఇటీవల ఎంతగా పాపులరయ్యాడో చూస్తున్నదే. కరోనా లాక్ డౌన్ సమయంలో అతడు చూపించిన చొరవ ఎందరో కార్మికుల కుటుంబాల్లో కన్నీళ్లను తుడిచింది. ఓవైపు అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుల్లో కార్మికుల్ని వారి సొంత ఊళ్లకు పంపేందుకు బస్సుల్ని ఏర్పాటు చేసి ధాతృత్వం చాటుకున్నాడు. అలాగే విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థుల్ని స్వదేశాలకు రప్పించేందుకు తనవంతు సాయం చేశాడు. దీనిపై ఎందరో రాజకీయపరమైన విమర్శలు చేసినా అవేవీ జనాలకు అర్థం కాలేదు. అతడు చేసిన సేవ మాత్రమే కనిపించింది. హిందీలో ఎందరు ప్రముఖ స్టార్లు ఉన్నా కానీ ఇప్పుడు సోనూసూద్ నే రియల్ హీరోగా చూస్తున్నారు జనం.

అందుకే సోనూ సూద్ ని చూసి చాలా మంది హీరోలే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు బుద్ధి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు కొందరు. కొన్ని సినిమాల్లో హీరోల కంటే ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు రెమ్యూనిరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది..! వారు మొన్న కరోనా క్రైసిస్ లో సాయం చేయలేదు సరికదా.. కనీసం మీడియా ముందుకు వచ్చి తామేం చేయాలనుకుంటున్నారో కూడా మాట్లాడలేదు..

సరే వదిలేద్దాం..! ఈ కోణం లో చూడండి..! ఇప్పుడు సోనూ పేరు అన్ని భాషల్లో వినిపిస్తోంది..! ఆయనకి పబ్లిసిటీ మీద పిచ్చి లేకపోవచ్చు. కానీ అయన చేసిన మంచి పని పిచ్చి పిచ్చిగా వైరల్ అవుతోంది. లాక్ డౌన్ అయ్యాక సోనూ సూద్ అన్ని భాషల్లో బిజీ అవ్వడం ఖాయం. కనీసం ఈ కోణం చూసి మన వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న సాయాలకు ముందుకు వస్తే బాగుంటుంది అని సినీ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి.