విలన్ హీరోయిజం కంటిన్యూ.. ఈసారి రైతు కోసం

0

ఎన్నో సినిమాల్లో క్రూరమైన విలన్ పాత్రలో కనిపించిన సోనూసూద్ గత కొన్ని రోజులుగా మీడియాలో మాత్రం ఈయన పేరు హీరోగా మారుమ్రోగి పోతుంది. లాక్ డౌన్ టైంలో వలస కార్మికులు వేలాది మంది రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న విషయాన్ని తెలుసుకుని చెలించి పోయిన సోనూసూద్ వారి కోసం తనవంతో సాయం అందించారు. వేలాది మంది వలస కార్మికులను ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారికి తినడానికి తిండి పెట్టి మరీ వారి సొంత ప్రాంతాల్లో దించాడు. ఇందుకోసం ఆయన ఏకంగా విమానంను కూడా బుక్ చేసిన విషయం తెల్సిందే.

వలస కార్మికుల పట్ల దేవుడిగా మారిన సోనూసూద్ ఆ తర్వాత రోడ్డుపై నడుస్తూ వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన దాదాపు 500ల మంది వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. ఆ కుటుంబాలకు తనకు తోచిన సాయం చేస్తానంటూ ప్రకటించిన సోనూ సూద్ ఇటీవలే తెలుగు మెడిసిన్ విద్యార్థులు వేరే దేశంలో ఉండగా వారిని కూడా వైజాగ్ కు రప్పించడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి సోనూసూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.

కృష్ణ మూర్తి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఒక రైతు నాగలికి ఎద్దు లేకపోవడంతో ఆయన బిడ్డలు ఆ నాగలిని లాగుతున్న వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో చూసిన సోనూసూద్ మనసు చలించిందన్నాడు. రేపు ఉదయం వరకు మీ ఇంటికి ఎద్దుల జంట వస్తుంది.. వాటితో మీరు పొలాన్ని దున్నండి. ఇక ఆ అమ్మాయిలు చదువుపై దృష్టి పెట్టాలి. నేను వారికి సాయం చేస్తానంటూ సోనూ సూద్ ప్రకటించాడు. దాంతో మరోసారి సోనూ సూద్ ను రియల్ హీరో అంటూ ఆయన అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.Please Read Disclaimer