స్క్రీన్‌షాట్ షేర్ చేసిన సోనూసూద్.. ఏమైంది?

0

తెలుగు సినీ పరిశ్రమలో ప్రతినాయకుడి పాత్రలో ఒదిగిపోయే నటుడు సోనూసూద్ నిజజీవితంలో మాత్రం నిజంగా కథానాయకుడే. సినిమాల్లో విలన్ పాత్రలో తన నైజం చూపించేలా చేసినా దైనందిన జీవితంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. సేవాగుణంలో దేవుడయ్యాడు. ఎంతో మందిని ఆదుకుని ఓదార్పునిచ్చాడు. ఆపదకాలంలో ఆపన్నహస్తం అందిస్తూ అందరికి ఆరాధ్యుడవుతున్నాడు. ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టి ప్రాణదాత అవుతున్నాడు.

సోనూసూద్ తాజాగా ఒక ఫొటో షేర్ చేశాడు. ఇందులో తన ఈ మెయిల్స్ 52 వేలకు పైగా ఉన్నట్లు సూచించాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. కరోనా సమయంలో ఆయన ఎంతో మందికి సేవ చేశారు. వారి సొంత స్థలాలకు వెళ్లేందుకు ప్రయాణ సాధనాలు సమకూర్చారు. బస్సులు, విమనాలు ఏర్పాటు చేసి తనలోని ఉదారతను చాటాడు.

కానీ ఇటీవల ఆయన ఆస్తులపై ఐటీ శాఖ దాడులు చేసింది. సోనూసూద్ ఇప్పటివరకు రూ.20 కోట్ల పన్నులు ఎగవేశారని ఆరోపించారు. దీంతో ఆయన అభిమానులు మండిపడ్డారు. స్వచ్ఛందంగా సేవ చేస్తుంటే ఆయనపై కావాలనే ప్రభుత్వం కక్ష గట్టి దాడులు చేయించిందని విమర్శలు చేశారు.

విదేశాల నుంచి సేకరించిన రూ. 18 కోట్ల విరాళాల్లో రూ.1.9 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మిగతా డబ్బు ఇంకా ఖర్చు చేయలేదని పేర్కొంది. దీనిపై సోనూసూద్ స్పందిస్తూ రూ. 18 కోట్లు ఖర్చు చేయడానికి ఎంత సమయం తీసుకుంటామని ప్రశ్నించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే క్రమంలో ఆ సొమ్ము ఖర్చు చేయడానికి వెనుకాడనని తెలిపారు.