పోటీనిచ్చే ఏకైక వారసుడు.. సోనూ సూద్ కొడుకుని చూశారా?

0

పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు.. జనులా పుత్రుని గనుకొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొదుర సుమతీ…! ప్రస్తుతం సోనూసూద్ సీన్ అలానే ఉంది మరి. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎనలేని గుర్తింపు పొందిన సోనూ వారసుడిని పరిచయం చేశాడు. ఇటు నిరంతర సేవాకార్యక్రమాలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన సోనూ వారసుడి బర్త్ డే వేళ తనతోనే స్పెండ్ చేశాడట. ఇది త్రోబ్యాక్ ఫోటోనే అయినా ఇటీవల తన వారసుడి బర్త్ డే వేడుకకు సంబంధించినదే.

జీవితంలో ఎన్ని ఉన్నా అన్ని కష్టాల్ని మరిపించేది ఫ్యామిలీ. దానికి సోనూసూద్ అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఇటీవల అన్ని వివాదాల్ని మరపిస్తూ సోనూసూద్ తన వారసుడిని పరిచయం చేశాడిలా. కొడుకు ఇషాన్ పుట్టినరోజున శుభాకాంక్షలు చెబుతూ సోను సూద్ ఒక ఫోటోని షేర్ చేశారు. తండ్రి-కొడుకు ఆనంద క్షణాలకు సంబంధించిన ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.

“ఇప్పుడు టీనేజ్ లోకి వెళ్లాడా“ అన్నట్టుగా సోనూసూద్ ఈ త్రోబాక్ ఫోటోలో కనిపిస్తుంటే.. వారసుడు ఇషాన్ పింట్-సైజ్ ఫిట్నెస్ ఔత్సాహికుడు అని అర్థమవుతోంది. అతను తన తండ్రి భంగిమను అనుకరిస్తూ చిచ్చరపిడుగునే తలపిస్తున్నాడు. ఇన్ స్టా పోస్టింగులో సోనూ ఇలా అన్నాడు. “పుట్టినరోజు శుభాకాంక్షలు నా హీరో ఇషాన్ సూద్. చివరగా నాకు ఫిట్నెస్ లో పోటీ ఇవ్వబోయే వ్యక్తి ఒకరున్నారు“ అంటూ సంబరపడిపోయాడు మరి.