భయపట్టే ప్రమోషన్.. టీవీ చానెల్ పై పోలీసులకు ఫిర్యాదు

0

ప్రముఖ హిందీ చానెల్ ‘సోనీ లివ్’ ప్రమోషన్ వెర్రితలలు వేసింది. వింతగా ప్రమోషన్ చేద్దామని చేసిన వారి ప్రయత్నం బెడిసి కొట్టింది. చివరకు పోలీసుల కేసుల వరకు వెళ్లింది. సోనీ లివ్ చానెల్ తాజాగా ఒక క్రైమ్ థ్రిల్లర్ షోను ప్రసారం చేయనుంది. దీనిని ప్రమోట్ చేసేందుకు షో మేకర్స్ ఒక కొత్త తరహాలో ఆలోచించారు. ఒక ఫోన్ నంబర్ నుంచి ప్రేక్షకులకు కాల్ చేసి.. తాను ఒక దారుణమైన హత్యను చూశానని.. భయంగా ఉందని చెబుతాడు. ప్రేక్షకులు వివరాలు అడిగే లోపే కాల్ కట్ చేస్తారు.

ఈ క్రమంలోనే క్రియేటివ్ నిర్మాత సృతి కిరణ్ కు ఇలాంటి కాల్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ లో తెలియజేసి ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విషయం తెలుసుకున్న తరువాత ఆమె సోనీ లివ్ చానల్ నిర్వాహకులు ఆమెను క్షమించమని కోరారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలని అనుకోలేదని తెలిపారు. దీనిపై సృతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చెత్త ప్రయత్నాలతో ప్రజలను భయపెట్టవద్దని కోరారు.