కెమెరా ముందు వలువలు వలిచేయమన్నాడు!

0

స్కైప్ లోకి రమన్నాడు.. బట్టలు మొత్తం విప్పేయమన్నాడు!! అంటూ ప్రముఖ నేపథ్య గాయని ఓ ప్రముఖ సింగర్ పై ఆరోపించారని గాయని చిన్మయి శ్రీపాద తాజాగా వెల్లడించారు. స్విట్జర్లాండ్ కి చెందిన సోఫియా అక్కర అనే గాయనికి మన దేశంలోని మీటూ గురించి తెలియకుండానే 2019లో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని షేర్ చేసిందట. ఆ విషయాన్ని తాజాగా చిన్మయి సోషల్ మీడియాల్లో వెల్లడించారు.

సౌత్ లో ప్రముఖ గాయకుడి వద్ద ప్లేబ్యాక్ సింగర్ గా పని చేసేప్పుడు తనకు ఓ విచిత్ర అనుభవం ఎదురైందని.. అప్పటివరకూ తనని ఆరాధించిన తాను షాక్ కి గురయ్యానని సదరు విదేశీ సింగర్ వాపోయారని చిన్మయి వెల్లడించారు. 18 వయసులో అదో అనుభవం. కెమెరా ముందు నగ్నంగా నిలబడాని ఆయన అడిగారు. దాంతో షాక్ తిన్నాను. అతనికి పెళ్లయి పిల్లలు ఉన్నారు. నాకంటే చాలా పెద్ద వాడు.. ఆ ఒక్క కాల్ తో ఆయనపై ఉన్న గౌరవం అంతా పోయింది.. అని సోఫియా చెప్పుకొచ్చిందట.

ఈ విషయాన్ని మీడియాకి చెబుతానని అన్నా కానీ అతడు లైట్ తీస్కున్నాడట. ఎవరూ నమ్మరని అన్నాడట. చిన్న ఏజ్ లో నాకు గొప్ప గుణపాఠం. ఇక్కడ ఎంతో జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది.. అని ఆమె ఆవేదన చెందిందట. ఇక వైరముత్తు .. కార్తీక్ సహా పలువురిపై చిన్మయి ఆరోపణల గురించి తెలిసిందే. మీటూ వేదికగా చిన్మయి రకరకాల ఆరోపణలు చేసారు. చిన్మయి మీటూ ఉద్యమంలో భాగంగా తనకు అండగా నిలుస్తాయనని సోఫియా ప్రామిస్ చేశారట.