ఆమెతో నాకు పోలిక ఏంటీ.. నేను 18 నెలలు సెక్స్ కు దూరంగా ఉన్నా

0

ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో సోఫియా హయత్ తెగ హడావుడి చేస్తుంది. ఈమె హాట్ ఫొటో షూట్స్ మరియు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే సోఫియా కొన్నాళ్ల క్రితం నన్ గా మారింది. దాదాపుగా రెండేళ్ల పాటు సోఫియా నన్ గా కొనసాగింది. మళ్లీ ఈమద్య సాదారణ డ్రస్సింగ్ లో కనిపిస్తుంది. ఇంతకు ముందు పూర్తిగా నన్ డ్రస్ ల్లో మాత్రమే ఆమె ఉండేది. సోఫియా మాత్రమే కాకుండా కొన్నాళ్ల క్రితం సనా ఖాన్ కూడా ఆధ్యాత్మికంగా మారి సన్యాసిని మాదిరిగా మారింది. కాని ఇటీవల ఆమె తన సన్యాసంను వదిలేసి పెళ్లి చేసుకుంది.

ఈ నేపథ్యంలో నెట్టింట కొందరు సనా ఖాన్ మరియు సోఫియా హయత్ ను పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ఇద్దరే అంటూ వారి గత నిర్ణయాలను ఆ తర్వాత మార్చుకున్న తీరును తప్పుబడుతున్నారు. సనా ఖాన్ తో పోల్చుతూ తనను ట్రోల్ చేస్తున్న వారికి సోఫియా వార్నింగ్ ఇచ్చింది. నాతో ఆమెను పోల్చడం ఏంటీ.. వాటిని చూస్తేనే చిరాకుగా ఉంది. వేసుకునే డ్రస్ ను బట్టి ఎలా ఆద్యాత్మికత వస్తుందని మీరు భావిస్తున్నారు.

నేను నన్ గా ఉన్న 18 నెలల పాటు సెక్స్ కు పూర్తిగా దూరంగా ఉన్నాను. ఇప్పుడు నేను నన్ గా డ్రస్ వేసుకోనంత మాత్రాన నాలో ఆధ్యాత్మిక చింతన తగ్గిందని మీరు ఎలా అంటారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. నేను ఇంకా సన్యాసినిగానే ఉన్నాను. నన్ను ఒంటరిగా వదిలేయండి.. ఇతరులతో నన్ను పోల్చి చిరాకు పెట్టవద్దంటూ నెటిజన్స్ కు వార్నింగ్ ఇచ్చింది.