ఫ్యాబ్ లుక్ పై ఫ్యాబులస్

0

బాలీవుడ్ లో ఉండే ఇంటర్నేషనల్ హాటీలలో ఒకరు సోఫీ చౌదరి. ఈ భామ ఇండియన్ కాదు. పేరు ఇండియన్ లాగే అనిపిస్తుంది కానీ బ్రిటన్ సిటిజెన్. బాలీవుడ్ లో పదికి పైగా సినిమాల్లో నటించిన ఈ సుందరి మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ లో లండన్ బాబు పాటకు కూడా స్టెప్పులేసింది. సోషల్ మీడియాకు తన స్పైసీ ఫోటోలతో మసాలా అద్దుతూ నెటిజన్ల కళాపోషణకు తన వంతు సాయం చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “ఫ్యాబ్ లుక్ మ్యాగజైన్ కవర్ పేజిపై మరోసారి కనిపించడం థ్రిల్లింగ్ గా ఉంది. ఈ సారి ఆధునిక బోహీమియన్ పెళ్ళికూతురిలా రెడీ అయ్యాను. థ్యాంక్ యూ ఫ్యాబ్ లుక్ మ్యాగజైన్” అంటూ ఓ పొడవాటి క్యాప్షన్ ఇచ్చింది. ఫ్యాబ్ లుక్ ఆగష్టు ఎడిషన్ లో సోఫీ పై ‘సోఫీ చౌదరి: ఆన్ సెట్టింగ్ పర్సనల్ గోల్స్’ అనే ఒక కథనం కూడా ప్రచురించారు. ఇక ఫోటో విషయానికి వస్తే రెడ్ కలర్ ఛోళీ – లెహెంగాలో ఒక యువరాణి తరహాలో మహారాజా చైర్ పై కూర్చుంది. మెడలో నెక్లెస్.. చేతికి గాజులు అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇక ఉప్పు లేని పప్పు.. హాట్నెస్ లేకుండా సోఫీని ఊహించలేం కదా.. అందుకేనేమో అందాలను ఫుల్ గా వడ్డించింది. దానికి తోడు ఓ సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ కూడా ఇచ్చింది.

ఈ ఫోటోకు మరో బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ ఒక లైక్ వేసుకుంది. ఈ ఫోటోకు సాధారణ నెటిజన్ల నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. “సోఫీ..హాటెస్ట్ బ్రైడ్”.. “ఫ్యాబ్ లుక్ పై ఫ్యాబులస్”.. “స్టన్నింగ్ డ్రెస్.. సో హాట్”.. “సోఫీ.. సో సెక్సీ” అంటూ పొగడ్తలు కురిపించారు.
Please Read Disclaimer