మల్లెపువ్వు అందం విరగబడి నవ్వినట్టు..!

0

సౌందర్య శర్మ… ఇటీవలి కాలంలో ముంబై సర్కిల్స్ లో హీట్ పెంచుతున్న పేరు ఇది. ముంబైలో మోడలింగ్ ర్యాంప్ వాక్ నుంచి వైరల్ కాకపోయినా.. ఈ అమ్మడి బ్యాక్ గ్రౌండ్ దృష్ట్యా ఇండస్ట్రీకి పూర్తిగా కొత్తే. అయినా తనదైన చొరవతో స్టార్ మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తోందట. ఇప్పటికీ వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తూ క్షణం తీరిక లేనంత బిజీగా ఉందంటే తన శరీరానికి ఉన్న ఆ మిల్కీ టోన్ లుక్ పెద్ద ప్లస్ అవుతోంది మరి.

దిల్లీకి చెందిన ప్రముఖ డాక్టర్ కుమార్తె అయిన సౌందర్య శర్మ గత కొంతకాలంగా బాలీవుడ్ ఫేజ్ 3 వరల్డ్ లో పాపులరవుతోంది. నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో ఈ అమ్మడు యూత్ కి గాలం వేస్తోంది. వీలు కుదిరితే బాలీవుడ్ లో కుదరకపోతే సౌత్ లో ఏదో ఒక చోట ఆటాడేయాలన్నది అమ్మడి ప్లాన్. వృత్తి రీత్యా డెంటల్ డాక్టర్ అయిన సౌందర్య శర్మ కు బాలీవుడ్ అంటే ఉన్న క్రష్ అంతా ఇంతా కాదు.

రెగ్యులర్ గా వేడెక్కించే ఫోటోషూట్లతో ఈ భామ అదిరిపోయే ట్రీటిస్తోంది. లేటెస్టుగా వైట్ అండ్ వైట్ ఇన్నర్ తో చెమటలు పట్టించేస్తోంది. కాంబినేషన్ పింక్ పరికిణీ ఆకర్షణ పెంచింది. ఆరుబయట అలా స్వేచ్ఛగా స్మైలీ అవతార్ తో గుండెల్ని టచ్ చేసింది. ఈ రేంజు ప్రయత్నం చూశాక అయినా నిర్మాతలు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేయకుండా ఉంటారా? సౌత్ నార్త్ డైరెక్టర్ల కన్ను పడకుండా ఉంటుందా మరి?