మళ్లీ చర్చల్లో హీరోయిన్స్ మల్టీస్టారర్

0

కొన్ని నెలల క్రితం నయనతార మరియు సమంత హీరోయిన్స్ గా విజయ్ సేతుపతి కీలక పాత్రలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ ప్రచారం జరిగింది. ట్రై యాంగిల్ లవ్ స్టోరీ తో ఈ చిత్రం సాగబోతుందని సౌత్ కు చెందిన ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఈ చిత్రంలో నటించబోతున్న నేపథ్యంలో టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో ఒక్కసారిగా ఆ సినిమా గురించి చర్చ జరిగింది. నయన్ ప్రియుడు అయిన విఘ్నేష్ శివన్ ఈ చిత్రంలో సమంత పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడో లేదో అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేశారు. కొన్ని రోజుల తర్వాత సినిమా గురించి చర్చ ఆగిపోయింది. సినిమా అటకెక్కిందేమో అనుకున్నారు. కాని సినిమా గురించి మళ్లీ చర్చ మొదలైంది.

కోలీవుడ్ మీడియాలో మళ్లీ ఈ చిత్రం గురించి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. క్రైమ్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తుంది. సమంత మరియు నయనతారలు ఈ చిత్రం కోసం డిసెంబర్ నుండి సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారట. తెలుగు మరియు తమిళంలో ఏకకాలంలో చిత్రీకరణ జరుపబోతున్నారు. తెలుగు వర్షన్ కోసం కొన్ని సీన్స్ ను ప్రత్యేకంగా చిత్రీకరించే అవకాశం కూడా ఉందంటున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో సమంత కొత్త సినిమాలు ఏమీ కమిట్ కాలేదు. ఒకవేళ నయనతారతో కలిసి సమంత సినిమా చేస్తే వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Please Read Disclaimer