Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఫలించిన ప్రార్ధనలు..కోలుకున్న ఎస్పీ బాలు

ఫలించిన ప్రార్ధనలు..కోలుకున్న ఎస్పీ బాలు


అందరి ప్రార్థనలు ఫలించాయి. ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం చాలా మెరుగైంది. ప్రస్తుతం ఆయన సొంతంగానే శ్వాస పీల్చుకోగలుగుతున్నారు. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ తాజాగా విడుదల చేసిన వీడియోలో తన తండ్రి ఆరోగ్యంపై పలు విషయాలు వెల్లడించారు. ‘ తన తండ్రి వేగంగా కోలుకుంటుండడంతో సంతోషంగా ఉంది. సోమవారం కల్లా గుడ్ న్యూస్ వినబోతున్నాం. ఆ రోజు ఆయనను ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ సహాయం లేకుండానే సొంతంగా శ్వాస తీసుకోగలుగుతున్నారు. సోమవారం కల్లా ఆయన కోలుకొని అందరితో మాట్లాడగలుగుతారని ‘ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగస్టు 5న ఎస్.పి.బాలు కరోనాతో చెన్నైలోని ఎమ్జీఎమ్ ఆస్పత్రిలో చేరారు. ముందు కాస్త బాగున్నప్పటికీ ఆ తర్వాత ఆయన పరిస్థితి చాలా క్రిటికల్ గా మారింది. దీంతో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రధాని మోదీకి విషయాన్ని వివరించి ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించారు.

ఎప్పటికప్పుడు ఎమ్జీఎమ్ ఆస్పత్రి సిబ్బంది తో పీఎంవో కార్యాలయం సంప్రదింపులు జరుపుతూనే వచ్చింది. ఆగస్టు 13న ఆయన పరిస్థితి పూర్తిగా క్షీణించిందనే అనే పుకార్లు వచ్చాయి. అయితే ఎమ్జీఎమ్ ఆస్పత్రి వైద్యులు విదేశాల నుంచి ప్రత్యేక వైద్య నిపుణులను రప్పించి ఆయన్ను రక్షించడంలో విజయవంతం అయ్యారు. ఐసీయూలో ప్రత్యేక గది ఏర్పాటు చేసి ఆయన సినిమాల్లోని ప్రఖ్యాత పాటలు వినేలా చర్యలు చేపట్టారు. అత్యుత్తమ వైద్య సేవలతో ఎస్పీ బాలు మెరుగ్గా కోలుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో ఎస్పీ బాలు కోలుకొని తిరిగి పాటలు కూడా పాడుతున్నారనే పుకార్లు చెలరేగాయి. ‘ విశ్వం నాకోసమే విస్తరించిందని పుడమి నాకోసమే పుట్టిందని ‘ లిరిక్స్ తో సాగే ఈ సోలో గీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది బాలు ఆసుపత్రి బెడ్ పై పాడిన పాట కాదు. గతంలో ఆయన ఓ కవిత కు ఇచ్చిన గీతా రూపం ఇది.

తన తండ్రి ఆరోగ్యంపై ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండగా.. మరోవైపు ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. బెడ్ పై పాట పాడారంటూ ప్రచారంలోకి తేవడం ఏమిటని.. పలువురు ప్రశ్నిస్తున్నారు. పాటలు పాడే పరిస్థితి ఉంటే ఐసీయూలో ఎందుకుంటారంటూ విమర్శిస్తున్నారు.