ఐసీయూలోనే బాలూ పెళ్లిరోజు వేడుకలు

0

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే ఆయన కోలుకుంటున్నారు. కాగా సోమవారం బాలూ దంపతుల పెళ్లిరోజు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో బాలూ దంపతులు 51 వ వివాహవార్షికోత్సవ వేడుకలు జరుకున్నట్టు సమాచారం. వైద్యుల సమక్షంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ బాలు దంపతులు శనివారం సాయంత్రం పెళ్లిరోజును జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎస్పీ బాలు సతీమణి సావిత్రి ఆసుపత్రికి వెళ్లారని ఐసీయూలోనే దంపతులు కేక్ కట్ చేసినట్లు అక్కడి తమిళ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. అయితే దీనిని ఆసుపత్రి వర్గాలు కానీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ కానీ అధికారికంగా ప్రకటించలేదు.

కరోనాతో బాధపడుతూ ఈ నెల 5 న ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలు పరిస్థితి విషమించడంలో ఆయనను ఐసీయూకు తరలించారు. ఆయనకు ఎక్మా ట్రీట్మెంట్ ఇచ్చినట్టు వైద్యులు తెలిపారు. అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం మెరుగవుతున్నది. బాలు ఆరోగ్య ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆస్పత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేస్తూ వచ్చాయి. అలాగే ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సైతం వీడియో సందేశాల ద్వారా సమాచారం అందిస్తున్నారు. గత వీడియోలో దేవుని ఆశీర్వాదంతో సోమవారం ఓ శుభవార్త వినబోతున్నారని చరణ్ ప్రకటించారు.