చైతు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్

0

సున్నితమైన భావోద్వేగాల చుట్టూ కథలు అల్లుకోవడంలో ప్రత్యేకత చాటుకునే దర్శకుడు శేఖర్ కమ్ముల యూత్ ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది కానీ ఫ్యామిలీస్ ని సైతం ఆకట్టుకునేలా లవ్ స్టోరీస్ తీయడం ఆయన ప్రత్యేకత. ఫిదాతో ట్రేడ్ సైతం నివ్వెరపోయే సక్సెస్ తో పాటు వసూళ్లను అందుకున్న శేఖర్ కమ్ముల ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఆ మధ్య అందరూ కొత్తవాళ్లతో ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు కానీ ఆశించిన విధంగా అవుట్ ఫుట్ రాలేదు.

ఆ కారణంగానే దాన్ని అర్ధాంతరంగా ఆపేసి గతంలో తనకు మాట ఇచ్చిన నాగ చైతన్యను లైన్ లో పెట్టేశాడు. టాలీవుడ్ లో తానే పెద్ద బ్రేక్ ఇచ్చిన సాయి పల్లవిని మరోసారి తన దర్శకత్వంలో తీసుకున్నాడు. ఇలా చైతు – సాయి పల్లవిల క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. వెంకీ మామ పూర్తవ్వగానే చైతు ఇందులో పాల్గొంటాడు ఇదిలా ఉండగా శేఖర్ కమ్ముల దీనికి సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకుంటారా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

విశ్వసనీయ సమాచారం మేరకు పవన్ అనే యంగ్ టాలెంట్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేయబోతున్నట్టు తెలిసింది. గతంలోనూ మిక్కీ జె మేయర్ – శక్తికాంత్ – రాధా కృష్ణ లాంటి ఎన్నో ఫ్రెష్ టాలెంట్స్ ని పరిశ్రమకు తీసుకొచ్చి వాళ్ళకో మార్గం చూపించింది శేఖర్ కమ్ములనే. ఈసారి కూడా ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ ని సెలెక్ట్ చేసుకున్నాడట. సంగీతంతో పాటు నృత్యానికి ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో చైతు సాయిపల్లవిలకు ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అవుతుందని ఇన్ సైడ్ టాక్.
Please Read Disclaimer